Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక నుంచి తక్కువ ధరకే
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఉగాది కానుకను ప్రకటించింది.
- V Santhosh Kumar
- Updated on- June 9, 2026 / 05:48 PM IST
Ap ration card holders good news mini marts steam rice distribution
- ఏపీలో వెయ్యి మినీ మార్టుల ఏర్పాటు
- కార్డుదారులకు తక్కువ ధరకే నిత్యావసరాలు
- రేషన్ షాపుల్లో నాణ్యమైన స్టీమ్ రైస్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఉగాది కానుకను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సూపర్ మార్కెట్ల తరహాలోనే నాణ్యమైన సరుకులు అందించేలా “మినీ మార్టుల” ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) భాగస్వామ్యంతో పట్టణాలు, నగరాలలో 1,000 మినీ మార్టులను నెలకొల్పనున్నారు. బహిరంగ మార్కెట్ ధరల భారం నుండి సామాన్యులను రక్షించేందుకు ఈ కార్పొరేట్ తరహా సబ్సిడీ((Andhra Pradesh)) మార్కెట్లను తీసుకువస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
PoK: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తత.. పోలీసుల కాల్పుల్లో 30 మందికి పైగా మృతి
ఈ మినీ మార్టుల ద్వారా రేషన్ కార్డుదారులకు పంచదార, గోధుమ పిండి, పామాయిల్, మిల్లెట్స్ వంటి పౌష్టికాహారాలు అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి. వీటితో పాటు రేషన్ దుకాణాల్లో సరికొత్త మార్పుగా ఇకపై నాణ్యమైన ‘స్టీమ్ రైస్’ పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అంగీకరించింది. నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, లబ్ధిదారులు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వం ఈ అడుగు వేసింది.
ఈ నూతన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ‘డిజిటల్ రూపాయి వాలెట్’ పేమెంట్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన నిత్యావసరాలను కొనుగోలు చేసి డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు జరపవచ్చు. స్టీమ్ రైస్ పంపిణీని తొలుత మధ్యాహ్న భోజన పథకంలో, అలాగే డిజిటల్ వాలెట్ విధానాన్ని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్‌లుగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వీటిని రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.
