AP Ration Card Update : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీ మొబైల్ నంబర్ లింక్ చేశారా? ఇప్పుడే ఈ పనిచేయండి..!

AP Ration Card Update : ఏపీ రేషన్ కార్డుదారులకు మొబైల్ నంబర్ లింకింగ్, ఈ-కేవైసీపై కీలక సమాచారం, రేషన్ షాపులో మొబైల్ నంబర్ ఎలా లింక్ చేయాలి? రేషన్ పంపిణీ సమయాలు, లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలివే..

AP Ration Card Update

  • ఏపీ రేషన్ లబ్ధిదారులకు కీలక సమాచారం.. ఈ పని తప్పనిసరి
  • రేషన్ సరుకులు సజావుగా అందాలంటే.. ఇది తప్పక తెలుసుకోండి
  • మీ రేషన్ కార్డులో ఈ వివరాలు ఉన్నాయా? వెంటనే చెక్ చేసుకోండి

AP Ration Card Update : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు పౌరసరఫరాల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన మార్పులు చేస్తోంది.
రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచడం, అర్హులైన లబ్ధిదారులకు సరుకులు అందేలా చూడటం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం పలు మార్పులు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేయడం, ఈ-కేవైసీ ప్రక్రియకు సంబంధించి అనేక పనులను పూర్తి చేయడం తప్పనిసరి.

రేషన్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ :
రేషన్ కార్డుతో మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం. మీ సమీపంలోని రేషన్ డీలర్‌ను సంప్రదించవచ్చు. అక్కడి డీలర్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ చేయాల్సిన విషయాన్ని చెప్పాలి. డివైజ్ ద్వారా ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.

రేషన్ కార్డుదారులు వెళ్లే ముందు మొబైల్ నంబర్ లింక్ సంబంధించిన తాజా నిబంధనలు, అవసరమైన వివరాలను రేషన్ డీలర్ లేదా సంబంధిత పౌరసరఫరాల అధికారుల వద్ద తెలుసుకోవడం మంచిది.

ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి :
రేషన్ కార్డులో పేరున్న అర్హులైన సభ్యుల ఈ-కేవైసీ వివరాలను కూడా చెక్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తికాకపోతే రేషన్ పొందలేరు. లబ్ధిదారుల వివరాలు వెరిఫై చేయలేరు. ఫలితంగా రేషన్ కార్డు నుంచి మీ పేరును తొలగించే అవకాశం ఉంటుంది.

Read Also : Gold Silver Rates Today : పండుగల వేళ పసిడి షాక్.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే?

అందుకే కుటుంబ సభ్యులందరి వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఈ-కేవైసీకి సంబంధించి సందేహాలుంటే రేషన్ దుకాణంలో లేదా అధికారిక సేవా కేంద్రంలో వివరాలు తెలుసుకోండి.

నెలలో ఎప్పుడెప్పుడు రేషన్ తీసుకోవచ్చు? :
సాధారణంగా రాష్ట్రంలో రేషన్ పంపిణీకి నెలలో ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు తీసుకోవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు పనిచేస్తాయి. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా తెరిచే ఉంటాయి.

అయితే, స్థానిక పరిస్థితులు, అధికారిక షెడ్యూల్‌ను బట్టి సమయాల్లో మార్పులు ఉండొచ్చు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్ద రేషన్ పంపిణీ వంటి సదుపాయాలపై సంబంధిత అధికారుల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.