AP Schools Holidays : వానల బీభత్సం.. ఏపీలో స్కూళ్లకు సెలవులు.. విద్యార్థుల కోసం సర్కార్ కీలక ఆదేశాలు!

AP Schools Holidays : ఏపీలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఇతర ఉత్తరాంధ్ర జిల్లాల్లో సెలవులపై నిర్ణయం ఎలా ఉండొచ్చో పూర్తి వివరాలను తెలుసుకుందాం..

AP Schools Holidays

  • వానల బీభత్సం.. స్కూళ్లకు సెలవులు.. ఏ జిల్లాల్లో అంటే?
  • ఉత్తరాంధ్రను వణికిస్తున్న వర్షాలు..
  • స్కూళ్లకు హాలిడే ప్రకటించిన అధికారులు
  • స్కూల్‌కు వెళ్లే పిల్లలకు అలర్ట్.. వర్షాల కారణంగా సెలవులు

AP Schools Holidays : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంద్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

అందుకే ముందుజాగ్రత్త చర్యగా వర్ష ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే బలపడింది. రానున్న గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం :
సెప్టెంబర్ 23, 24 తేదీల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాలపైనా కూడా వర్ష ప్రభావం పడనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాబోయే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also : Kisan Vikas Patra : మీ డబ్బు డబుల్ చేసే పోస్టాఫీస్ స్కీమ్ ఇదే! రూ.10 లక్షలకు ఎంత రాబడి వస్తుందంటే?

ప్రస్తుతం పూరీకు 220 కి.మీ, కళింగపట్నంకు 230 కిమీ, విశాఖపట్నంకు 320 కిమీ, ఒడిశాలోని గోపాల్‌పూర్ కు 220 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

సెప్టెంబర్ 23న (బుధవారం) వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సెప్టెంబర్ 24 (గురువారం) తెల్లవారుజామున విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళ, బుధవారం రోజుల్లో శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏయే జిల్లాల్లో స్కూళ్లకి సెలవు? :

శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు ఎక్కువగా ఉంటే స్కూళ్లకు సెలవు ఇవ్వాలని ఏపీ సర్కార్ నుంచి కూడా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.

మరోవైపు బంగాళాఖాతంలోని అల్పపీడనం 23వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజామున మధ్య విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అందుకే రానున్న 2 రోజులు ఏపీకి కీలకం కానున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

విపత్తు సమయంలో ప్రజలకు అత్యవసర సాయం అందించేందుకు కలెక్టరేట్‌లో స్పెషల్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా ఆపద వస్తే వెంటనే 08942 240557 నంబర్‌కు ఫోన్ చేసి సాయం పొందవచ్చని అధికారులు తెలిపారు.