Ap Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం(Ap Rains) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర వర్షాపాయాన్ని ఎదుర్కోనుంది.

Ap weather alert heavy rains red alert issued for coastal districts

Ap Rains: మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర వర్షాపాయాన్ని ఎదుర్కోనుంది. రానున్న కొన్ని రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సముద్రం తీవ్ర అలజడిగా మారనుండటంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ముందస్తు తీవ్రతను బట్టి వివిధ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ వాతావరణ హెచ్చరికల ద్వారా జారీ చేసింది.

Amaravati Land Pooling: ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు.. రెండో విడత భూసమీకరణకు రైతులు సిద్ధం.. సీఆర్డీఏకు అంగీకార పత్రాల అందజేత

ఈ నెల 22, 23 తేదీల్లో హెచ్చరికలు ఇవే:

ఈ నెల 22వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక 23న వర్ష (Ap Rains)తీవ్రత మరింత పెరిగి కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, యానాం ప్రాంతాలకు వాతావరణ కేంద్రం అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. అదే రోజున శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నందున ఆరెంజ్ అలర్ట్ కొనసాగనుంది.

24వ తేదీన ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్:

తుఫాను ప్రభావం 24వ తేదీన కూడా తీవ్రంగానే ఉండనుంది. ఆ రోజున కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, యానాం ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా అల్లూరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.