AP Police Recruitment: ఏపీ నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త.. 1,156 పోస్టుల భర్తీకి AP SLPRB భారీ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు మీకోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్(AP Police Recruitment) రిక్రూట్‌మెంట్ బోర్డ్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో మొత్తం 1,156 కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ అర్హతతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Apslprb notification released for 1156 police constable firemen and warder posts

AP Police Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (AP Police Recruitment) అదిరిపోయే శుభవార్త అందించింది. పోలీస్ శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖ, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1,156 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్) 542, ఏఆర్ కానిస్టేబుల్స్ 285, ఫైర్‌మెన్ 158, పురుషుల వార్డర్లు 150, మహిళా వార్డర్లు 21 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు AP SLPRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Cheyutha Pensions: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త.. కొత్తగా 4.63 లక్షల ‘చేయూత’ పింఛన్లు మంజూరు.. నవంబర్ 19న నేరుగా ఖాతాల్లోకి!

విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు వివరాలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జులై 1 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదివి పరీక్షలకు హాజరై ఉంటే సరిపోతుంది. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 24 ఏళ్లు, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టులకు 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, నాన్‌లోకల్ అభ్యర్థులు రూ.300, ఏపీ స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.

నాలుగు దశల్లో ఎంపిక విధానం.. నెలకు రూ.80 వేలకు పైగా వేతనం:

అభ్యర్థుల ఎంపికను ప్రిలిమినరీ రాత పరీక్ష (200 మార్కులు), దేహదారుఢ్య ప్రమాణాల పరీక్ష (PMT), శారీరక సామర్థ్య పరీక్ష (PET – 1600మీ., 100మీ. పరుగు, లాంగ్ జంప్), తుది రాత పరీక్ష (200 మార్కులు) ఆధారంగా నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు వేతన శ్రేణితో పాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు లభిస్తాయి. ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష తేదీలను బోర్డు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది.