అర్నబ్ ఎఫెక్ట్.. నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్.. ఏ పంటకు ఎంతంటే?
Cyclone Arnab Crop compensation : అర్నబ్ అత్యంత తీవ్ర తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.
- Harish Thanniru
- Updated on- October 28, 2026 / 07:19 PM IST
Arnab Cyclone
Cyclone Arnab Crop compensation : అర్నబ్ అత్యంత తీవ్ర తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. తుపాను కారణంగా రాష్ట్రంలో 2.24 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 14 జిల్లాల్లో సుమారు 3.45లక్షల మంది రైతులపై తుపాను ప్రభావం చూపిందని ప్రభుత్వం పేర్కొంది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినండంతో రైతులు లబోదిబోమంటున్నారు. అయితే, ప్రభుత్వం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ప్రకటించింది.
ఏ పంటకు ఎంత నష్టపరిహారం అంటే..
♦ పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం
♦ వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం
♦ చెరుకు పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం
♦ సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ..
సోయాబీన్, పొద్దుతిరుగుడుకు రూ.15 వేల సాయం
♦ అరటి, పసుపు, మామిడి, జీడిమామిడితో పాటు..
కాఫీ, డ్రాగన్ ఫ్రూట్‌కు ఎకరాకు రూ.35 వేల పరిహారం
♦ కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌కు రూ.25 వేలు
♦ తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం
♦ కొబ్బరి, ఆయిల్ పామ్ ఒక్కో చెట్టుకు రూ.15 వేలు
ఉచిత రేషన్ పంపిణీ..
చేనేత మగ్గాలు ఉన్నవారికి, మత్స్యకారులకు : 50 కేజీల బియ్యం, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ వంటనూనె, 1 కేజీ కందిపప్పు.
ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు : 25 కేజీల బియ్యం.
పంట నష్టం మినహా, మిగతా అన్ని రకాల ఆర్థిక సాయాన్ని బాధితులకు రేపటి నుంచే పంపిణీ చేయడం ప్రారంభమవుతుంది.
