Vijayawada : బెజవాడలో రోడ్డుపై బ్లేడ్ బ్యాచ్ హల్ చల్
విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు వీరంగం సృష్టించాడు. చిట్టినగర్ లో రోడ్డు మీదకు వచ్చిబ్లేడ్ తో శరీరంపై గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన చిట్టినగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే జరిగింది. బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు కోటి కోసుకుంటుండగా అక్కడ ఉన్నవారు తమ ఫోన్ లో దృశ్యాలను బంధించారు.
- kunduru Vinod
- Published On : July 5, 2021 / 06:04 PM IST
Vijayawada (3)
Vijayawada : విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు వీరంగం సృష్టించాడు. చిట్టినగర్ లో రోడ్డు మీదకు వచ్చి బ్లేడ్ తో శరీరంపై గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన చిట్టినగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే జరిగింది. బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు కోటి కోసుకుంటుండగా అక్కడ ఉన్నవారు తమ ఫోన్ లో దృశ్యాలను బంధించారు.
కొందరు అతడి ప్రవర్తన చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ ఘటన ఈ నెల 2వ తేదీ జరిగినట్లు సంచారం. చిట్టినగర్ పోలీస్ లిమిట్స్ లో ఓ నిర్మానుష్య ప్రదేశంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి సేవిస్తుండగా వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైకి వచ్చి గట్టిగా కేకలు వేస్తూ అలజడి సృష్టించారు.
వీరిలో కోటి అనే వ్యక్తి తన చేతిలో ఉన్న బ్లేడ్ తో శరీరంపై గాయాలు చేసుకున్నాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గతంలో కూడా విజయవాడలో ఇటువంటి ఘటనలు జరిగాయి. రాను రాను బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అధికమైపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని చెబుతున్నారు.
