YS Jagan : సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్.. 25రోజులు విదేశీ పర్యటనకు అనుమతిచ్చిన కోర్టు
YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూకే పర్యటనకు వెళ్లనున్నారు.
- Harish Thanniru
- Published on- April 17, 2026 / 02:04 PM IST
YS Jagan
- సీబీఐ కోర్టులో జగన్‌కు రిలీఫ్..
- ఫ్యామిలీతో విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్
- ఏప్రిల్ 20నుండి వచ్చేనెల 15 వరకు విదేశాలకు జగన్
YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూకే పర్యటనకు వెళ్లనున్నారు. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి యూరోఫ్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి కోర్టును కోరారు. దీంతో ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దాదాపు 25రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు జగన్ కు అనుమతి ఇచ్చింది. దేశం విడిచి వెళ్లేముందు కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ష్యూరిటీ సీబీఐ అధికారులకు అందజేయాలని కోర్టు సూచించింది.
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి దేశం విడిచి వెళ్లాలంటే సీబీఐ న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. గతంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన పలు సందర్భాల్లో సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. తాజాగా.. యూరోప్, యూకే పర్యటనలకు వెళ్తున్న జగన్.. సీబీఐ కోర్టును అనుమతి తీసుకున్నారు.
