AP Tobacco Farmers: ఏపీ పొగాకు రైతులకు కేంద్రం శుభవార్త.. బార్న్‌కు వడ్డీ లేని రుణాలు.. ఏకంగా రూ.50 వేలు

ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు(AP Tobacco Farmers) కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Central govt set to provide interest-free loan of 50,000 to ap tobacco farmers

AP Tobacco Farmers: ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవడంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల భారం నుంచి తక్షణ ఉపశమనం కల్పించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌సీవీ పొగాకు సాగు చేసే ప్రతి బార్న్‌కు రూ.50,000 వడ్డీ లేని రుణం మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది పొగాకు రైతులకు భారీ ఊరట లభించినట్లయింది.

NTR Bharosa Pension: ఏపీ పింఛన్‌దారులకు అలర్ట్.. అక్టోబర్ పంపిణీ వేళల్లో మార్పులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు!

సీఎం చంద్రబాబు చొరవ – కేంద్రంతో సంప్రదింపులు సఫలం:

రాష్ట్రంలోని పొగాకు రైతులు(AP Tobacco Farmers) ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. రైతులను ఆదుకోవాలని, వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత రెండు నెలలుగా కేంద్ర వాణిజ్య శాఖతో జరిగిన వరుస చర్చల అనంతరం, సీఎం ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం చివరికి వడ్డీ లేని రుణ సదుపాయానికి ఆమోదముద్ర వేసింది.

ప్రైవేట్ అప్పుల భారం నుంచి విముక్తి – హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు:

కేంద్రం నుంచి నేరుగా అందే ఈ వడ్డీ లేని రుణ సహాయం వల్ల పొగాకు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం తప్పుతుంది. పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ వర్గాలు భావిస్తున్నాయి. సమయానికి తగిన ఆర్థిక బాసట లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీవీ పొగాకు రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం పట్ల తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.