AP Elections Petrol Bomb: ఏపీ పరిషత్ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పలు జిల్లాల్లో చెలరేగిన ఘర్షణలు.. కడప, పల్నాడులో పెట్రోల్ బాంబులతో దాడులు!
AP Elections Petrol Bomb Attack : ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ(AP Elections MPTC-ZPTC) పోలింగ్ కడప, పల్నాడు జిల్లాల్లో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- November 5, 2026 / 11:59 AM IST
AP Elections Petrol Bomb Attack YSRCP - TDP Polling Faction Clashes During ZPTC MPTC Poll
AP Elections TDP vs YSRCP Petrol Bomb Attack: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని భావించినప్పటికీ, పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చెలరేగి ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా కడప, పార్వతీపురం మన్యం, పల్నాడు, వైఎస్సార్ జిల్లాల్లో దాడులు, తోపులాటలతో పోలింగ్ కేంద్రాల (AP Elections) వద్ద ఉద్రిక్తత రాజ్యమేలింది. గొడవలు తీవ్రమవ్వడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు.
కడప, మన్యం, పల్నాడులో దాడులు.. రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు:
వైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంటలో వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తోసేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కీసరలో టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడికి తెగబడగా, పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో జరిగిన ఘర్షణలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు పులివెందుల పరిధిలోని ఆర్.తుమ్మలపల్లిలోనూ ఇరువర్గాలు ఘర్షణకు దిగగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
