Srisailam Temple : శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
Srisailam temple : శ్రీశైల దేవస్థానం ఆలయ పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికారు.
- Harish Thanniru
- Published on- October 6, 2026 / 02:38 PM IST
CM Chandrababu invited to the Devi Sharannavaratri celebrations at Srisailam
Srisailam Temple : శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు.
Also Read : Karnataka : సీఎం సార్.. ఆరు గ్యారెంటీలు కాదు.. ఏడు గ్యారెంటీలు.. పెళ్లిని కూడా చేర్చాలన్న యువకుడు
ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
శ్రీశైల దేవస్థానం ఆలయ పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికారు. సీఎంకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను దేవాలయ అధికారులు అందించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని అడిగి తెలుసుకున్నారు.
శరన్నవరాత్రుల్లో ముఖ్యమైన పూజా కార్యక్రమాలు..
♦ అక్టోబర్ 11 మొదటి రోజు : ఉత్సవాల ప్రారంభం సూచకంగా శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం, గణపతి పూజ, కలశ స్థాపన, ఘట స్థాపన, అఖండ దీపారాధన నిర్వహిస్తారు. ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 12 రెండో రోజు : దేవి నవరాత్రుల్లో రెండో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 13 మూడో రోజు : దేవి నవరాత్రుల్లో మూడో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 14 నాలుగో రోజు : దేవి నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 15 ఐదో రోజు : దేవి నవరాత్రుల్లో ఐదో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 16 ఆరో రోజు : శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు కాత్యాయనీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 17 ఏడో రోజు : శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 18 ఎనిమిదో రోజు : శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 19 తొమ్మిదో రోజు : శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబర్ 20 పదవ రోజు : విజయదశమి – శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు, శ్రీ భ్రమరాంబా దేవి నిజరూప అలంకారం అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
