CM Chandrababu Naidu : తెలంగాణలో పవన్ సభను అడ్డుకుంటారా? చంద్రబాబు సంచలన కామెంట్స్!
CM Chandrababu Naidu : జనసేనాని పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభను అడ్డుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చునని అన్నారు.
- Sreehari A
- Updated on- June 3, 2026 / 04:17 PM IST
CM Chandrababu Naidu
CM Chandrababu Naidu : తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరైన పని కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ, సభకు రాష్ట్రంలో అనుమతులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందిస్తూ తెలంగాణలో పవన్ రాజకీయ కార్యక్రమాలను అడ్డుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావటం తప్ప మరో మార్గం ఏమిలేదని చెప్పారు. అసలు రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాల్సింది పోయి ప్రజల మధ్య విబేధాలను తీసుకురావడం సరికాదన్నారు.
Read Also : AP Govt : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం షాపులు, బార్ల వద్ద ఆ బోర్డులు పెట్టొద్దు..
ఎవరు ఏం చేశారో అందరికి తెలుసు :
ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 ఏళ్లు గడిచిపోయిందని, ఇప్పుడు ఈ విషయంలో ఇంతగా రాద్దాంతం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తెలంగాణ ప్రజలకు ఎవరు మంచి చేశారు అనేది అందరికి తెలుసునని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని లాజికల్‌గా తీసుకెళ్లాలే తప్పా అనసవరంగా వివాదాలు సృష్టించటం ఎవరికీ మంచిది కాదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చనని అన్నారు. రాజకీయాలు అనేవి ఒక రాష్ట్రానికే పరిమితం కావన్నారు. గతంలో తాను కూడా తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసి వచ్చినట్టు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
