Sanjeevani Scheme : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. సంజీవని పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్..

Sanjeevani scheme : ఏపీలోని ప్రతిఒక్కరి ఆరోగ్యంకోసం సంజీవని లాంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

CM Chandrababu Naidu gave key update on Sanjeevani scheme

  • ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్
  • సంజీవని పథకంపై చంద్రబాబు కీలక అప్డేట్
  • ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు

Sanjeevani Scheme : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు తీసుకొస్తు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఓవైపు చర్యలు తీసుకుంటుండగా.. మరోవైపు.. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి సంజీవని పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : TET Paper Leak : టెట్ పేపర్ లీక్.. పరీక్ష వాయిదా వేసిన ప్రభుత్వం.. ఆందోళనలో అభ్యర్థులు

సంజీవని ప్రాజెక్టులో ఇంటి వద్దకే 104 మొబైల్ మెడికల్ ల్యాబ్ వాహనాలు వస్తాయి. ప్రతి ఒక్కరికీ 42 నుంచి 75 రకాలు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈ సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా కీలక విషయాన్ని వెల్లడించారు. శనివారం మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరి ఆరోగ్యంకోసం సంజీవని లాంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని అమలు చేస్తామని అన్నారు.

యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్లతో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలని, తాజా ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అదేవిధంగా రైతులు తమ పంటలకు వీలైనంత వరకు ఎరువులు తక్కువగా వాడాలని సూచించారు. చాలామంది ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారని, ఏపీ వ్యాప్తంగా 20లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.