CM Chandrababu Naidu : రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళ తాట తీయాలి.. సీఎం చంద్రబాబు నాయుడు
CM Chandrababu Naidu : రాజకీయ ముసుగులో నేరాలను ఎట్టిపరిస్థితుల్లో సహించొద్దు.. రాజకీయ నేరస్తులకు రక్షణ కల్పించొద్దు.. రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బందులు పెట్టే రౌడీలను తాటతీయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
- Harish Thanniru
- Updated on- October 21, 2026 / 09:56 AM IST
CM Chandrababu Naidu
CM Chandrababu Naidu : రాజకీయ ముసుగులో నేరాలను ఎట్టిపరిస్థితుల్లో సహించొద్దు.. రాజకీయ నేరస్తులకు రక్షణ కల్పించొద్దు.. రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బందులు పెట్టే రౌడీలను తాటతీయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో రాష్ట్ర హోమంత్రి అనిత, సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశ రక్షణకు భంగం కలిగే చర్యలను ఏపీ పోలీసు వ్యవస్థ అడ్డుకుందని అన్నారు.
Also Read : School Holidays : ఏపీలోని విద్యార్థులకు ఊహించని గుడ్న్యూస్.. మళ్లీ నాలుగు రోజులు సెలవులు..? ఎలా అంటే..
భద్రతపై నమ్మకం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలీసులు ఉంటేనే సమాజంలో శాంతిభద్రతలు సాధ్యం, నేనెప్పుడూ అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తానని చెప్పారు. సోషల్ మీడియా సైకోలను వదిలిపెట్టొద్దని సూచించారు. ఏపీ పోలీసులంటే టెక్నాలజీలో టాప్ అని దేశమంతా అనుకోవాలని, ఆ మేరకు దినదినాభివృద్ది చెందాలని పోలీసులకు చంద్రబాబు నాయుడు సూచించారు.
