AP Land Passbooks: 56 లక్షల కొత్త పాస్ బుక్స్ సిద్ధం.. మార్చినాటికి భూసమస్యలు ఖతం.. చంద్రబాబు కీలక ప్రకటన
AP Land Passbooks: 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలకు భూ హక్కు పత్రాలను అందజేశారు.
CM Chandrababu stated that land-related issues would be resolved and passbooks distributed by March.
- భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- మార్చికి కొత్త పాస్ పుస్తకాలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
AP Land Passbooks: కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని మాచవరంలో నిర్వహించిన ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలకు భూ హక్కు పత్రాలను అందజేశారు. గతంలో రెవెన్యూ శాఖపై ఉన్న అవినీతి అపవాదును చెరిపివేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శక సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Read Also – YS Jagan Padayatra : పాదయాత్రపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన.. ముహూర్తం ఫిక్స్..!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. 56 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, ప్రజల భూములకు పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రధాన అజెండా అని తేల్చిచెప్పారు. అత్యుత్తమ సాంకేతికతతో, ఎవరూ మార్చడానికి వీలు లేని రీతిలో పటిష్టమైన రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్‌పుస్తకాలను (AP Land Passbooks) పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 36 లక్షల మందికి పాస్ బుక్‌లు అందించామని, వచ్చే మార్చి నాటికి మొత్తం 56 లక్షల మందికి అందజేస్తామని వెల్లడించారు.
పేదల సేవలో సూపర్ సిక్స్.. నంద్యాల అరెస్ట్ జ్ఞాపకాలు!
పాలన అంటే సచివాలయానికే పరిమితం కాకుండా ప్రజల వద్దకు వచ్చి వారి కష్టసుఖాలు తెలుసుకోవడమేనని చంద్రబాబు(CM Chandrababu) వ్యాఖ్యానించారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు పి4 మోడల్, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. సరిగ్గా మూడేళ్ల క్రితం నంద్యాలలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిన రోజులను గుర్తు చేసుకుంటూ, పవన్ కల్యాణ్ ఆ క్లిష్ట సమయంలో అండగా నిలిచారని పేర్కొన్నారు.
