YS Jagan Mohan Reddy : పాదయాత్రపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన.. ముహూర్తం ఫిక్స్..!
YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు.
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. పర్చూరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశం బుధవారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చారు. 2017 సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు.
ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పాదయాత్ర 2.0 ఉంటుందని జగన్ సమావేశంలో పేర్కొనట్లు తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పాదయాత్ర ఉండబోతుందని జగన్ పేర్కొన్నట్లు సమాచారం.
