Sree Charani : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం శ్రీచరణి ఆల్‌టైమ్ రికార్డు..
భారత మహిళా క్రికెటర్, తెలుగు తేజం శ్రీచరణి (Sree Charani ) అరుదైన ఘనత సాధించింది.
SREE CHARANI SETS ALL-TIME WOMEN'S T20I RANKINGS RECORD
Sree Charani : భారత మహిళా క్రికెటర్, తెలుగు తేజం శ్రీచరణి అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. రేటింగ్ విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 817 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇదే అత్యధిక రేటింగ్. 2018లో ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ పేరిట ఉన్న 806 రేటింగ్ పాయింట్ల రికార్డును శ్రీచరణి అధిగమించింది.
ఇదిలా ఉంటే.. శ్రీచరణి ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉంది. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో 12 వికెట్లు తీసింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో 4 వికెట్లతో భారత్ ఆసియా కప్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఆ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించి ఎనిమిదో సారి ట్రోఫీని ముద్దాడింది. జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆతిథ్య జపాన్‌పై 10 పరుగులకు 4 వికెట్లు తీసి తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది. ఇక స్వర్ణ పతక మ్యాచ్‌లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో భారత్ ఓడించగా, ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టింది.
Rohit Sharma : వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు..
మహిళల టీ20 క్రికెట్లో టాప్-5 బౌలర్ల ర్యాంకింగ్స్ ఇవే..
* శ్రీచరణి (భారత్) – 817 రేటింగ్ పాయింట్లు
* దీప్తి శర్మ (భారత్) – 754 రేటింగ్ పాయింట్లు
* సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్) – 723 రేటింగ్ పాయింట్లు
* చార్లీ డీన్ (ఇంగ్లాండ్) – 722 రేటింగ్ పాయింట్లు
* లారెన్ బెల్ (ఇంగ్లాండ్) – 712 రేటింగ్ పాయింట్లు
View this post on Instagram
