×
Ad

Jagan Target 175 : వైనాట్ 175.. టీడీపీ ఎమ్మెల్యేల స్థానాలపై జగన్ ఫోకస్, ఎలాగైనా గెలవాల్సిందేనని దిశానిర్దేశం

175 అసెంబ్లీ స్థానాలను గంపగుత్తగా గెలవాల్సిందే.. ఇదీ వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పెట్టిన టార్గెట్. ప్రస్తుతం టీడీపీ సభ్యులు ఉన్న స్థానాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జగన్.

  • Published On : November 2, 2022 / 11:37 PM IST

Jagan Target 175 : 175 అసెంబ్లీ స్థానాలను గంపగుత్తగా గెలవాల్సిందే.. ఇదీ వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పెట్టిన టార్గెట్. ప్రస్తుతం టీడీపీ సభ్యులు ఉన్న స్థానాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జగన్. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గాల వైసీపీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు జగన్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కుప్పంతో స్టార్ట్ చేసిన జగన్ ప్రస్తుతం మండపేట నియోజకవర్గ వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కుప్పం, అద్దంకి, టెక్కలి నియోజకవర్గ నేతలతో జగన్ వరుస సమీక్షలు నిర్వహించారు. టీడీపీ నేతల నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు. మండపేట నియోజకవర్గంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంపై మార్గదర్శనం చేశారు జగన్.