Corona Fear : హృదయవిదారకం.. ఆ నలుగురు లేక ఎండ్ల బండిపై మృతదేహం తరలింపు
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి.. చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసింది.
- Naveen
- Updated on- June 5, 2021 / 11:17 AM IST
Corona Fear
Corona Fear : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి.. చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసింది. కరోనా భయంతో అయిన వారు కూడా అంతిమ సంస్కారాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మరో దయనీయ ఘటన జరిగింది.
కరోనాతో నాలుగు రోజుల క్రితం తండ్రి మరణించగా, ఆ విషాదం నుంచి కోలుకోకముందే నాయనమ్మ కూడా కొవిడ్ తో కన్నుమూసింది. ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మనవడే.. ఎండ్లబండిపై మృతదేహాన్ని తీసుకెళ్లాడు.
అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన జల్లి మల్లేశ్వరరావు(48) కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందారు. ఆయన తల్లి సరస్వతి(70) శుక్రవారం కరోనాతో ఇంటి దగ్గరే తుదిశ్వాస విడిచారు. కరోనా భయంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మనవడు సుబ్రహ్మణ్యం ఎడ్ల బండిపై మృతదేహాన్ని తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. మల్లేశ్వరరావు భార్య, కూతురు ప్రస్తుతం కరోనా పాజిటివ్‌తో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.
