ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. నిన్న(ఏప్రిల్ 3,2020) రాత్రి 10.30 నుంచి నేటి(ఏప్రిల్ 4,2020) ఉదయం 10.30 వరకు కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 4కి పెరిగింది.
కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కేసులు నమోదవగా, జిల్లాలో కేసుల సంఖ్య 27కి చేరింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 23కి పెరిగింది. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ ఒక్కో కరోనా కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కడప జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23. చిత్తూరు జిల్లాలో మొత్తంగా 10, ప్రకాశం జిల్లాలో మొత్తంగా 18 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా కేసులపై తాజా బులెటిన్ విడుదల చేసింది. నిన్న(ఏప్రిల్ 3,2020) రాత్రి 10.30 నుంచి నేటి(ఏప్రిల్ 4,2020) ఉదయం 10.30 వరకు కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 4కి పెరిగింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కేసులు నమోదవగా, జిల్లాలో కేసుల సంఖ్య 27కి చేరింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 23కి పెరిగింది. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ ఒక్కో కరోనా కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కడప జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23. చిత్తూరు జిల్లాలో మొత్తంగా 10, ప్రకాశం జిల్లాలో మొత్తంగా 18 కేసులు నమోదయ్యాయి.
* ఏపీలో 180కి చేరిన కరోనా కేసులు
* అనంతపురం 2
* చిత్తూరు 10
* తూర్పుగోదావరి 11
* పశ్చిమగోదావరి 15
* గుంటూరు 23
* కడప 23
* కృష్ణా 27
* కర్నూలు 4
* నెల్లూరు 32
* ప్రకాశం 18
* విశాఖ 15
* కరోనా వైరస్ తో ఏపీలో ఒకరు మృతి
Also Read | రియల్ లెజెండ్ ఇతడే : ఇటలీలో అంబులెన్స్ డ్రైవర్ అవతారమెత్తిన రగ్బీ స్టార్