విదేశాల నుంచి వచ్చిన వారు ఇంట్లో నుంచి బయటికి వస్తే చర్యలు – ఏపీ సర్కార్

  • Publish Date - March 19, 2020 / 08:00 AM IST

విదేశాల నుంచి వచ్చిన వారు నిబంధనలు పాటించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం సూచించింది. వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసు జారీ చేయబడుతుందని వెల్లడించింది. ఈ మేరకు 2020, మార్చి 19వ తేదీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీనిని అతిక్రమించిన వారికి ఏపీ ఎపిడెమిక్ డిసీజ్ (COVID -19 2020) ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం..చట్టరీత్యా చర్య తీసుకొనబడుతుందని హెచ్చరించింది.

104 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కరోనా వైరస్‌కు సంబంధించిన ఆరోగ్య సలహాలు పొందవచ్చని, అన్ని జిల్లాల కలెక్టర్లను కోవిడ్ – 19 నియంత్రణ, పర్యవేక్షణ చర్యలపై జిల్లా నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వెల్లడించింది. (పంజాబ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బంద్)

 

విదేశీయులకు సూచనలు : – 
* వైరస్ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారు రోగ లక్షణాలు లేకపోయినా..భారతదేశానికి వచ్చిన రోజు నుంచి 14 రోజులు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి..వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 
* ఇతర కుటుంబసభ్యులతో కలవరాదు. సందర్శకులను అనుమతించరాదు. బహరంగ ప్రదేశాల్లో తిరగవద్దు. 
 

* జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే..వెంటనే వైద్య సలహా కోసం 104కి ఫోన్ చేయాలి. 
* అవసరమైతే..108 అంబులెన్స్ సేవలను ఉపయోగించుకుని..దగ్గరిలోని ప్రభుత్వాసుపత్రికి చేరుకోవాలి. 

చైనా నుంచి వ్యాపించిన ఈ వైరస్ 161 దేశాలను ప్రభావితం చేస్తోందని తెలిపింది. ఈ వైరస్ డీసీజ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ Pandemic గా ప్రకటించిందని, ప్రపంచస్థాయిలో ప్రమాద అంచనాను అత్యున్నత స్థాయిగా వర్గీకరించిందని వెల్లడించింది. 

ప్రజలకు సలహాలు : – 
* కరోనా వైరస్ డీసీజ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య సలహాలకు కట్టబడి ఉండాలి. 
* తుమ్ము / దగ్గు వచ్చిన సమయంలో రుమాలు, ఇతరత్రా వాటిని ఉఫయోగించి ముక్కు, నోటిని కప్పుకోవాలి. 
* సబ్బు, నీటితో తరచూ చేతులు కడుక్కోవాలి. 

Read More :దిమ్మ తిరిగిపోయే స్కెచ్ వేసిన కేసీఆర్ : KTR CM అవుతారని ప్రచారం