Free Bus Ride: నేటి నుంచే.. ఏపీలో మరో పథకం అమలు.. మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..
ఏపీ ఎస్ ఆర్టీసీకి చెందిన 74శాతం బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Free Bus Ride: సూపర్ సిక్స్ లో భాగంగా ఇవాళ మరో హామీని అమలు చేయనుంది ఏపీ సర్కార్. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను ప్రారంభించనుంది. స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్ పథకాన్ని లాంచ్ చేయనుంది. ఏపీ ఎస్ ఆర్టీసీకి చెందిన 74శాతం బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నేటి నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ఆర్టీసీ అధికారులు సన్నద్ధమయ్యారు. 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగానే ప్రయాణం చేయొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికి ఇంకా ప్రయాణికుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ జోన్ లో 1800కు పైగా బస్సుల్లో ఈ పథకం అమలు జరుగుతుంది.
* ఉచిత ప్రయాణం కోసం 8వేల 458 బస్సులు
* పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు – 5851
* ఎక్స్ ప్రెస్ బస్సులు – 1610
* సిటీ ఆర్డినరీ బస్సులు – 710
* సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు – 287
* శ్రీశైలం ఘాట్లలో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో అమలు చేయకూడదని నిర్ణయం
* డ్రైవర్ల కొరత అధిగమించటానికి ప్రతి డిపోలో తాత్కాలిక డ్రైవర్ల సంఖ్య పెంపు
* మహిళా ప్రయాణికుల చార్జీల విలువ ఏడాదికి రూ.1,453 కోట్లు
* నిర్వహణ ఖర్చు అదనంగా రూ.201 కోట్లు పెరుగుతాయని అంచనా
* ఫ్రీ బస్ స్కీమ్ తో నెలకు సుమారు రూ.162 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1942 కోట్ల అదనపు ఖర్చు
* పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం
* డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ లాంటి ఐడీ కార్డులు తీసుకెళ్లొచ్చు
* ఆధార్ కార్డులో ఏపీ అడ్రస్ ఉన్నట్లు అయితే జీరో టికెట్ ఇస్తారు
* వయసుతో సంబంధం లేదు. ఏపీలోని మహిళలు అందరికీ ఉచితం
* ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం