తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన దిత్వాహ్.. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
దక్షిణ, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది.
- T Venkateshwarlu
- Published On : November 30, 2025 / 09:54 PM IST
Cyclone Ditwah: నైరుతి బంగాళాఖాతంలో దిత్వాహ్ తుపాను బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో మరింత బలహీన పడనుంది.
కడలూరుకు 90 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 90 కిలోమీటర్లు, చైన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో పయనించింది. పుదుచ్చేరి, చైన్నై, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువుగా తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. (Cyclone Ditwah)
కులం వేరని చంపారు.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి.. నుదిటిపై కుంకుమ రాసుకుని ప్రమాణం
దీని ప్రభావంతో దక్షిణ, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది.
