Murasu Cyclone : తీరం దాటిన మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

Murasu Cyclone : ఏపీని మురుసు తుపాను వణికిస్తోంది. అయితే, మంగళవారం ఉదయం నెల్లూరు - నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తుపాను తీరందాటింది.

Murasu Cyclone

Murasu Cyclone : ఏపీని మురసు తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, తాజాగా తుపాను తీరందాటింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల సమయంలో నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తుపాను తీరందాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరందాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.. మరికొన్ని ప్రాంతాల్లో గంటలకు 120 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.

Also Read : AP Municipal Election Results 2026 : గెలిచేదెవరో.. నేడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఓట్ల లెక్కింపు తీరు ఇలా.. తొలి ఫలితం ఎక్కడ.. ఎప్పుడంటే?

తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణాతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.