Vijayawada Rains: విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం, రవాణా.. పవన్ కళ్యాణ్ అత్యవసర రివ్యూ

విజయవాడ నగరాన్ని శనివారం కురిసిన భారీ వర్షం(Vijayawada Rains) ముంచెత్తింది.

Deputy CM Pawan holds an emergency review meeting regarding heavy rains in Vijayawada.

  • వర్షంతో విజయవాడ జలమయం
  • పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష
  • 24 గంటలు భారీ వర్షాలు

Vijayawada Rains: విజయవాడ నగరాన్ని శనివారం కురిసిన భారీ వర్షం ముంచెత్తింది. ఉదయం కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఎడతెరిపిలేకుండా కురిసిన వానకు ప్రధాన రహదారులన్నీ జలమయమై నడుములోతు నీరు చేరింది. బెంజ్ సర్కిల్, బస్టాండ్, బందరు రోడ్డు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోగా, విజయవాడ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దవ్వడం, దారి మళ్లించడం జరిగింది. మరోవైపు కొండ ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

AP Endowments Department: ఆ వార్తలు నమ్మకండి.. ఫేక్ న్యూస్ ను తీవ్రంగా ఖండించిన ఏపీ దేవాదాయశాఖ

పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష:

అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాల (Vijayawada Rains)తీవ్రతపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

మరో 24 గంటలు భారీ వర్షాలు:

దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో ఇప్పటికే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవగా, ప్రజలు, వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.