AP EAPCET 2026: ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2026(AP EAPCET 2026) ఫలితాలు విడుదల అయ్యాయి.
EAPCET 2026 AP EAMCET Results OUT Direct link cets apsche ap gov in
AP EAPCET 2026: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 1,82,317 మంది (70.52%) అర్హత సాధించగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో రికార్డు స్థాయిలో 63,546 మంది (89.59%) ఉత్తీర్ణత సాధించారు. ఈ విజయాలు రాష్ట్ర ప్రగతికి సరికొత్త ఊతాన్నిస్తాయని ఆయన ఆకాంక్షించారు.
ఈ ఫలితాల్లో విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో ఆడబిడ్డలు 71.65 శాతం ఉత్తీర్ణతతో అబ్బాయిల కంటే ముందంజలో నిలవడం విశేషం. సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మన విద్యార్థుల నైపుణ్యాలు ఏపీ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మారుస్తాయన్నారు.
పరీక్ష(AP EAPCET 2026) రాసిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in/EAPCET నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, ఫలితాలు మరియు కౌన్సెలింగ్ వివరాల కోసం 9552300009 అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని తదుపరి విద్యా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
