SIR Enumeration : SIR 2026కు మరో ఛాన్స్.. జూలై 24 వరకు గడువు పొడిగింపు.. ఇంట్లోనే ఇలా ఎన్యూమరేషన్ ఫారం నింపండి!
SIR Enumeration 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24, 2026 వరకు గడువు పొడిగించింది.
- Sreehari A
- Published on- July 14, 2026 / 03:22 PM IST
SIR Enumeration 2026
- ఓటర్ల జాబితా సవరణకు గడువు పొడిగింపు
- జూలై 31న ముసాయిదా జాబితా విడుదల
- ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, అక్టోబర్ 3న తుది జాబితా
SIR Enumeration : ఏపీలో ఓటర్లకు భారీ గుడ్ న్యూస్.. ఓటర్ల సవరణ, కొత్త ఓటు రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోలేదా? ఎన్యూమరేషన్ ఫారం నింపలేదా? డోంట్ వర్రీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24, 2026 వరకు గడువు పొడిగించింది.
వాస్తవానికి జూలై 14తో ఈ ఎన్నికల ఓటర్ల సవరణ, నమోదు ప్రక్రియ ముగియనుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలను పరిగణనలోకి తీసుకుని మరో 10 రోజులు పొడిగించింది.
అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ఇంకా పూర్తికాలేదు. దీని కారణంగా అర్హులైన ఓటర్లు అవకాశం కోల్పోకుండా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది.
- ఓటర్లు (https://voters.eci.gov.in, https://voters.eci.gov.in) పోర్టల్‌లోకి వెళ్లండి
- ‘ఎన్యూమరేషన్ ఫారం ఆప్షన్’పై క్లిక్ చేయాలి.
- EPIC (ఓటర్ ఐడీ) నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.
- మొబైల్‌కు వచ్చే OTPతో లాగిన్ అవ్వాలి.
వ్యక్తిగత వివరాలు, అడ్రస్, పోలింగ్ కేంద్రం, పుట్టిన తేదీ, ఆధార్ (ఆప్షనల్), మొబైల్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు నమోదు చేసి ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఫారం పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. లేదంటే డౌన్‌లోడ్ చేసి సంబంధిత BLOకు సమర్పించాలి. బీఎల్ఓ సంతకం చేసిన రసీదును ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దగ్గర పెట్టుకోవాలి.
తల్లిదండ్రుల వివరాలు ఇలా :
2002 ఓటర్ల లిస్టులో మీ తల్లిదండ్రుల వివరాలు తెలుసుకోవాలంటే అదే పోర్టల్‌లో గతంలో వారు నివసించిన జిల్లా, నియోజకవర్గం, ఇంటిపేరు ఆధారంగా సెర్చ్ చేయొచ్చు. అవసరమైతే BLO సాయంతో కూడా ఈ వివరాలను పొందవచ్చు.
2026 జూలై ఒకటి నాటికి 18 ఏళ్లు పూర్తి అయిన ప్రతిఒక్కరూ ఈ ప్రత్యేక సవరణలో కొత్తగా ఓటరుగా రిజిసర్ట్ చేసుకోవచ్చు. ముసాయిదా ఓటర్ల జాబితా జులై 31న విడుదల కానుంది. అప్పటిలోగా మీ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను తెలపవచ్చు. ఆగస్టు 30 వరకు మీకు అవకాశం ఉంటుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది.
అన్ని సవరణల అనంతరం ఫైనల్ ఓటర్ల లిస్టు అక్టోబర్ 3, 2026న విడుదల కానుంది. ఇప్పటికైనా గడువులోగా వివరాలు రిజిస్టర్ చేసి ఓటు హక్కును కన్ఫార్మ్ చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. రాజకీయ పార్టీలకు కూడా ఈ మార్పులను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించింది.
