×
Ad

DL Ravindra Reddy : జగన్ నుంచి విజయమ్మ, షర్మిలకు ముప్పు.. వారు జాగ్రత్తగా ఉండాలి: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్ సూచనలమేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని విజయమ్మ, షర్మిల జాగ్రత్తగా ఉండాలి అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published On : April 14, 2023 / 03:49 PM IST

YS Vijayamma, YS Sharmila,

DL Ravindra Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ విజయమ్మకు, వైఎస్ షర్మిలకు ముప్పు పొంచి ఉందని ..వారిద్దరు జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు దగ్గరపడుతున్న కొద్దీ వారిద్దరికి జగన్ వల్ల ప్రమాదం పొంచి ఉంది అంటూ హెచ్చరించారు డీఎల్. ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చు అంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా జగన్ సానుభూతి కోసమే కోడికత్తి దాడి డ్రామాలాడారని డీఎస్ ఆరోపించారు. గతంలో బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా జగన్ సానుభూతి కోసమే జరిగిందని డీఎల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావటానికి సానుభూతి కోసం తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై జగన్ ఎటువంటి దారుణానికైనా పాల్పడే అవకాశముందని.. ఎన్నికలు సమీపిస్తున్నవేళ వారిద్దరు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు మరోసారి అధికారంలోకి రావటానికి జగన్ ఎంతటి దారుణానికైనా దిగజారతారని.. వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని ఇవన్నీ తన దృష్టికి వచ్చాయని డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపాయి.