Heart Attack : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి
తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
- bheemraj
- Updated on- November 20, 2023 / 10:38 AM IST
ODI World Cup Final
Fan Died Of Heart Attack : ఏపీలో విషాదం నెలకొంది. తిరుపతి జిల్లాలో క్రికెట్ అభిమాని మృతి చెందారు. వరల్డ్ కప్ ఫైన్ మ్యాచ్ చూస్తూ ఉత్కంఠకు లోనై గుండె పోటుతో మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే అతను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. నిన్న (ఆదివారం) రాత్రి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తుండగా ఉత్కంఠకు లోనైన జ్యోతి కుమార్ యాదవ్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి
