Ambati Rambabu : బ్రో అట్టర్ ఫ్లాప్.. నిర్మాతలూ పవన్ కల్యాణ్‌తో జాగ్రత్త, అమ్మవారి శాపం తగిలింది- మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఇచ్చే ప్యాకేజీ విశ్వప్రసాద్ ద్వారా ఇప్పిస్తున్నారు. విశ్వప్రసాద్ ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా.. Ambati Rambabu

Ambati Rambabu - Pawan Kalyan(Photo : Google)

Ambati Rambabu – Pawan Kalyan : ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) బ్రో సినిమాపైన(Bro Movie), జనసేనాని పవన్ కల్యాణ్ పైనా(Pawan Kalyan) మరోసారి నిప్పులు చెరిగారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రో సినిమా అట్టర్ ప్లాప్ సినిమా అన్నారాయన. సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిన్న మళ్ళీ వివాదం చేశారని చెప్పారు. శ్యాంబాబు పాత్ర పెట్టి పవన్ పాత్రతో దూషించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. బ్రో సినిమా రూ.55.26 కోట్లు షేర్ కలెక్ట్ చేసిందన్నారు. టోటల్ సినిమా కలెక్షన్స్ లో పవన్ రెమ్యునరేషన్ డబ్బులు కూడా రాలేని పరిస్థితి నెలకొందన్నారు.

”నన్ను కించపరిచే విధంగా పవన్ సినిమాలు తీస్తున్నారు. బ్రో సినిమాకు కలెక్షన్లు తగ్గాయి. దాంతో బ్రో సినిమాలోని నటీనటులతో నాపై విమర్శలు చేయిస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలు ఇక ఆడవు.. వారాహి అమ్మవారి శాపం తగిలింది.. పవన్ తో సినిమా తీసేటప్పుడు నిర్మాతలు ఆలోచించుకోవాలి.. డైరెక్ట్ పొలిటికల్ సినిమా తీసుకుంటే తీసుకోండి.. పాత్రలు పెట్టి దూషించడం తప్పు కాదా? నిర్మాత విశ్వ ప్రసాద్ వెనుక టీడీపీ ఉంది. టీడీపీ ఇచ్చే ప్యాకేజీ విశ్వప్రసాద్ ద్వారా ఇప్పిస్తున్నారు. విశ్వప్రసాద్ ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా సినిమాల ద్వారా చేస్తున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తియ్యడానికి చూస్తున్నారు. పవన్ కు సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి.. రెండింటికీ న్యాయం చెయ్యలేడు” అని అంబటి రాంబాబు అన్నారు.(Ambati Rambabu)

Also Read..Srikakulam: శ్రీకాకుళంలో టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ సూపర్ ప్లాన్!

” ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు అని పెట్టకుండా రాంబాబు అని పెట్టుకున్నా నేనేమీ అనుకునేవాడిని కాదు. పైగా నా డ్యాన్స్‌ సింక్‌ కాలేదని అంటున్నారు. నేనేమీ డ్యాన్స్‌ మాస్టర్‌ను కాదు కదా. ఈ విమర్శలపై ప్రజలు ఆలోచన చేయాలి. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న నటులు, నిర్మాతలు, దర్శకులకు, తివిక్రమ్‌ వంటి రచయితలకు ఒక విషయం చెబుతున్నా. మళ్లీ మళ్లీ ఇలాంటి సన్నివేశాలు తీస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలని ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అంబటి రాంబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘‘ఎన్టీఆర్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా చేయలేదు. చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉండగా సినిమాలు చేయలేదు. కానీ, పవన్‌ కల్యాణ్‌ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు చేస్తున్నారు. సినీ రంగంలో హీరోగా రాణించి, మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి కథతో మేము కూడా సినిమా చేయాలనుకుంటున్నాం. వాటికి ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘బహు భార్య ప్రావీణ్యుడు’, ‘పెళ్లిళ్లు పెటాకులు’, ‘తాళి-ఎగతాళి’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’, బ్రో లాగా మ్రో (మ్యారేజెస్‌, రిలేషన్స్‌, అఫెండర్‌) ఇలా టైటిల్స్‌ అనుకుంటున్నాం. పేరు పెట్టాక అందరికీ చెబుతాం” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’ (BRO Movie). ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటుడు పృథ్వీ పోషించిన శ్యాంబాబు పాత్ర హాట్ టాపిక్ గా మారింది. ఓ పబ్‌లో డ్యాన్స్‌ చేస్తున్న శ్యాంబాబుపై పవన్‌ సెటైర్లు వేస్తారు. ఆ పాత్ర ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు.

Also Read..Janasena : వాలంటీర్ చేసిన హత్యకు బాధ్యత ఎవరు తీసుకుంటారు జగన్? ముఖ్యమంత్రిని నిలదీసిన పవన్ కల్యాణ్