Cyclone Asani : తుపాను ఎఫెక్ట్ తో విమానాలు రద్దు

అసని తుపాను ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి.

Viskahapatnam Air Port

Cyclone Asani : అసని తుపాను ప్రభావంతో విశాఖపట్నంలో  వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి. కర్నూలు, బెంగుళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి.

అలాగే విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్, ముంబై, చెన్నై నుంచి వచ్చే ఇండిగో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో మంగళవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Cyclone Asani : తుపాను సహాయక చర్యలకోసం సిధ్ధంగా ఉన్న ఇండియన్ కోస్ట్‌గార్డ్