Cyclone Asani : తుపాను సహాయక చర్యలకోసం సిధ్ధంగా ఉన్న ఇండియన్ కోస్ట్‌గార్డ్

విశాఖకు 350 కిలోమీటర్ల దూరంలోనూ... పూరీకి 550 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైన అసాని తుపానును ఎదుర్కునేందుకు విశాఖ‌లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమయ్యింది.

Cyclone Asani : తుపాను సహాయక చర్యలకోసం సిధ్ధంగా ఉన్న ఇండియన్ కోస్ట్‌గార్డ్

Asani Cyclone

Cyclone Asani :  విశాఖకు 350 కిలోమీటర్ల దూరంలోనూ… పూరీకి 550 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైన అసాని తుపానును ఎదుర్కునేందుకు విశాఖ‌లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమయ్యింది. సహాయ చర్యలకోసం వీరా నౌకను సిధ్దం చేశారు. రిలీఫ్ సామాగ్రితో ఐదు విపత్తు సహాయక బృందాలు, 20 మంది కోస్టు గార్డు సిబ్బంది సిధ్ధంగా ఉన్నారు.

ఈనెల 12వ తేదీ వరకు మత్స్యకారుల సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. విశాఖ, విజయనగరం,శ్రీకాకుళం,ఈస్ట్ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేశారు.

ఇప్పటికే తీరం వెంబడి బలమైనగాలులు వీస్తున్నాయి. అన్ని ప్రధాన పోర్టుల్లోనూ రెండవ నెంబరు ప్రమాదహెచ్చరికలు ఎగరవేశారు. రేపటి నుండి ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. మంగళవార౦ మధ్యాహ్నానానికి తీవ్ర తుపాను బలహీన పడుతూ తుపాను గా మారే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

Also Read : Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం-నిరసనకారుల దాడిలో అధికార పార్టీ ఎంపీ మృతి