Vaibhav Sooryavanshi : అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ..
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) శతకంతో చెలరేగాడు.
IND vs eng final Vaibhav Sooryavanshi century second Fastest U19 WorldCup hundred
Vaibhav Sooryavanshi : అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ శతకంతో చెలరేగాడు. శుక్రవారం హరారే వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో రాల్ఫీ ఆల్బర్ట్ బౌలింగ్లో సింగిల్ తీసి వైభవ్ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అండర్19 ప్రపంచకప్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రాజ్ బావ పేరిట ఉండేది. 2022లో ఉగాండతో జరిగిన మ్యాచ్ రాజ్ 69 బంతుల్లో సెంచరీ చేశాడు.
𝗛.𝗨.𝗡.𝗗.𝗥.𝗘.𝗗 💯
Cometh the hour, cometh Vaibhav Sooryavanshi 👏
He smashes a 55-ball century in the #U19WorldCup Final 🫡
Updates ▶️ https://t.co/hisult7mtv pic.twitter.com/vNZY4ZoLJ3
— BCCI (@BCCI) February 6, 2026
T20 World Cup 2026 : మరో రోజులో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
ఇక ఓవరాల్గా అండర్ 19 ప్రపంచకప్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ రెండో స్థానంలో నిలిచాడు. విల్ మలాజ్జుక్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతడు ఈ ఎడిషన్లోనే జపాన్ పై 51 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
అండర్19 ప్రపంచకప్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
విల్ మలాజ్జుక్ (ఆస్ట్రేలియా) – 2026లో జపాన్ పై 51 బంతుల్లో
వైభవ్ సూర్యవంశీ (భారత్) – 2026లో ఇంగ్లాండ్ పై 55 బంతుల్లో
ఖాసిం అక్రమ్ (పాకిస్తాన్) – 2022లో శ్రీలంక పై 63 బంతుల్లో
బెన్ మేయెస్ (ఇంగ్లాండ్) – 2026లో స్కాట్లాండ్ పై 65 బంతుల్లో
రాజ్ బావా (భారత్) – 2022లో ఉగాండా పై 69 బంతుల్లో
