Bharat Taxi App : ఓలా, ఉబర్‌తో పనిలేదు.. కొత్త ‘భారత్ టాక్సీ’ యాప్ వచ్చేసింది.. రైడ్ బుకింగ్ చాలా ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Bharat Taxi App : భారత్ టాక్సీ యాప్ ద్వారా మంచి ఆదాయంతో పాటు క్యాబ్ డ్రైవర్లకు రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, భార్య, పిల్లలు కూడా కవర్ ఈ పాలసీ కవర్ ఉంది.
Bharat Taxi App
Bharat Taxi App : టాక్సీ బుక్ చేసుకునేవారికి అద్భుతమైన న్యూస్.. రైడ్ బుకింగ్ కోసం కొత్తగా భారత్ టాక్సీ యాప్ వచ్చేసింది. ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులకు పోటీగా దేశీయ మొట్టమొదటి కోఆపరేటివ్ క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ టాక్సీ యాప్ సర్వీసును ఢిల్లీలో ప్రారంభించారు. ఈ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఇకపై టాక్సీ బుకింగ్ చేసుకునే వినియోగదారులతో పాటు టాక్సీ డ్రైవర్లు కూడా అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు.
ఈ యాప్ సర్వీసు ద్వారా డ్రైవర్లు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సి పనిలేదు. అంటే.. ట్రిప్ కోసం మొత్తం పేమెంట్ నేరుగా బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. డ్రైవర్లు ఇక సర్వీసు ప్రొవైడర్లు మాత్రమే కాదు.. ఫ్లాట్ ఫారం వాటాదారులు, యజమానులుగా వ్యవహరించవచ్చు. ఈ భారత్ టాక్సీ యాప్ ద్వారా డ్రైవర్ల ఆదాయం కూడా భారీగా పెరగనుంది. వారు రైడ్ల నుంచి సంపాదించుకునే డబ్బు ఎవరికి చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అద్భుతమైన ఫీచర్లు, మెట్రో టికెట్లు బుకింగ్ :
భారత్ టాక్సీ యాప్, భారతీయ యూజర్ల కోసం ఈజీ ఇంటర్ ఫేస్ తో రూపొందించారు. ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీతో సహా అనేక ప్రాంతీయ భాషలకు సపోర్టు చేస్తుంది. యాప్ ఓపెన్ చేసిన వెంటనే వినియోగదారులకు భారత్ బైక్, భారత్ ఆటో, క్యాబ్ ఎకానిమీ, క్యాబ్ ప్రియారిటీ వంటి అనేక రైడ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ఈ యాప్ స్పెషల్ ఫీచర్ ఏమిటంటే.. ప్రయాణీకులు మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ప్రదేశాలను కూడా సేవ్ చేసుకోవచ్చు. వినియోగదారులు పదే పదే అడ్రస్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఓలా, ఉబర్ కన్నా ఛార్జీలు చౌక.. :
టాక్సీ ఛార్జీల విషయంలో వినియోగదారులు ఆందోళన అవసరం ఉండదు. ఎందుకంటే.. భారత్ టాక్సీ యాప్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఓలా, ఉబర్ సర్వీసులతో పోలిస్తే ఛార్జీలు చాలా చవకగా ఉంటాయి. భారత్ టాక్సీ యాప్‌లో సర్జ్ ప్రైసింగ్ లేదు.
అంటే.. వర్షం, భారీ ట్రాఫిక్ లేదా రద్దీ సమయాల్లో మీ నుంచి అదనంగా పైసా కూడా ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులకు ముందుగా నిర్ణయించిన ఛార్జీలే ఉంటాయి. ప్రస్తుతం ఈ భారత్ టాక్సీ యాప్ సర్వీసు ఢిల్లీ ఎన్సీఆర్లో అందుబాటులోకి వచ్చింది. రాజ్ కోట్ లో ట్రయల్ తర్వాత త్వరలో ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఇతర నగరాల్లో కూడా విస్తరించనుంది.
సేఫ్టీ కోసం SOS, లైవ్ ట్రాకింగ్ ఫీచర్లు :
ఈ యాప్ ప్రయాణీకుల సేఫ్టీ కోసం ముఖ్యంగా మహిళల భద్రత కోసం అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. యాప్ లోపల స్పెషల్ SOS బటన్ ఉంది. సింగిల్ క్లిక్‌తో ఎమర్జెన్సీ కాంటాక్టులకు మెసేజ్, కాల్, లొకేషన్ వివరాలతో వెళ్లిపోతుంది. మొత్తం ప్రయాణం నేరుగా ట్రాకింగ్ సేఫ్టీని అందిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫై చేసి వెంటనే బుకింగ్ చేసుకోవచ్చు.
జీరో కమిషన్.. అంతా డ్రైవర్ జేబులోకే :
ప్రతి రైడ్‌కు ఎలాంటి కమిషన్ ఉండదు. డ్రైవర్ 100 శాతం ఛార్జీని నేరుగా పొందవచ్చు. రోజుకు రూ. 30 యాక్సెస్ ఫీజు మాత్రమే చెల్లించాలి. రోజువారీ ఆదాయం 20 శాతం నుంచి 30శాతానికి పెరుగుతుంది. అంతేకాదు.. ఆరోగ్యపరంగా కూడా భద్రత ఉంది. డ్రైవర్లకు రూ. 10 లక్షల ఆరోగ్య బీమా ఉంటుంది. భార్య, పిల్లలు కూడా ఈ పాలసీ కవర్ అవుతుంది.
ఇప్పటివరకూ 2 లక్షల 50వేల వాహనాలు, 3లక్షల మంది డ్రైవర్లు ఇప్పటికే చేరారు. మీరు డ్రైవర్ అయితే ఈ బెనిఫిట్స్ అసలు వదులుకోవద్దు. భారత్ టాక్సీ డ్రైవర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఈ యాప్ లైవ్ లొకేషన్ ట్రాకింగ్, రైడ్-షేరింగ్ ఆప్షన్లు, 24×7 సర్వీసు సపోర్టును అందిస్తుంది.
‘భారత్ టాక్సీ’ ఎలా డౌన్లోడ్ చేయాలి? :
చాలా ఈజీగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో (Google Play Store) ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్సులో ‘Bharat Taxi’ లేదా ‘Bharat Taxi Cab, Auto & Bike’ అని టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేయండి. ఆపిల్ యూజర్లు ఆపిల్ యాప స్టోర్ కు వెళ్లండి. Bharat Taxi”కోసం సెర్చ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో సర్వీసు మొత్తం ఫ్రీగా ఉంటుంది. డౌన్లోడ్ తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి మీ ఫోన్ నంబర్‌తో రిజస్టర్ చేసుకోండి.
యాప్‌లో ఎలా రిజిస్టర్ చేయాలి? :
యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక వెంటనే ఓపెన్ చేయండి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి వచ్చే OTPని వెరిఫై చేయండి. మీ పూర్తి పేరు, ఇమెయిల్ అడ్రస్ వంటి ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి. రైడ్ ప్రారంభానికి ముందే మీ ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా అనేది తెలియజేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత హోమ్ పేజీ సర్వీసులు, లైవ్, టిక్కెట్లు, ప్రొఫైల్‌ను డిస్ ప్లే చేస్తుంది. మీ ఇల్లు లేదా ఆఫీసు అడ్రస్ సేవ్ అవుతుంది.
భారత్ టాక్సీలో రైడ్ బుకింగ్ ఎలా? :
రైడ్ బుకింగ్ చాలా ఈజీ. యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో “Where You Going” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ ఫోన్ లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి. పికప్ లొకేషన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లాలో ఆ డేటా ఎంటర్ చేయండి. తర్వాత వెహికల్ టైప్ ఎంచుకోండి.
బైక్, ఆటో, కారు ఏదో ఒకటి ఎంచుకుంటే ఎంత ఛార్జీ అనేది కనిపిస్తుంది. కన్ఫార్మ్ చేస్తే బుకింగ్ పూర్తవుతుంది. మెట్రో టికెట్ కోసం మెట్రో ఆప్షన్ క్లిక్ చేయండి. ఇంటర్సిటీ కోసం ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. రైడ్ సమయంలో మీరు లైవ్ ట్రాకింగ్‌ను చెక్ చేయొచ్చు.
