Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం-నిరసనకారుల దాడిలో అధికార పార్టీ ఎంపీ మృతి

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్ధిక సంక్షోభం కారణంగా ప్రధాని రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే... అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం-నిరసనకారుల దాడిలో అధికార పార్టీ ఎంపీ మృతి

Sri Lanka Crisis

Sri Lanka Crisis :  శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్ధిక సంక్షోభం కారణంగా ప్రధాని రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే… అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనల కార్యక్రమాలు చేస్తున్నారు.

కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై.. ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు.

పరిస్థితులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, లాఠీలతో దాడి చేశారు. ఈ దాడుల్లో 78 మంది వరకు గాయపడ్డారు.ఈ క్రమంలోనే సోమవారం అధ్యక్ష కార్యాలయం బయట నిరసన తెలుపుతున్న వారిపై రాజపక్స విధేయులు కర్రలతో దాడికి దిగినట్లు సమాచారం.

నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి యత్నించడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు.. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో.. పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అధికార నేతల రాజీనామాకు డిమాండ్ పెరుగుతోంది.
Also Read : Viral Video : చిరుతపులితో పోరాడిన పోలీసులు, అటవీశాఖ అధికారులు

ఈక్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసన కారులపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఈఘటనతో ఆగ్రహించిన నిరసన కారులు అమరకీర్తి కారును అడ్డగించారు. ఆయనపై దాడికి దిగారు. ఈదాడిలో అమరకీర్తి మరణించినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తటంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు.