Viral Video : చిరుతపులితో పోరాడిన పోలీసులు, అటవీశాఖ అధికారులు

హర్యానాలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులపైకి ఒక చిరుతపులి దాడి చేసింది. అందరిలాగా వారు పారిపోకుండా దానిపై ఎదురు దాడికి దిగి దాన్నిపట్టుకోవాలని చూశారు... కానీ పులి వారిని గాయ పరిచింది.

Viral Video : చిరుతపులితో  పోరాడిన పోలీసులు, అటవీశాఖ అధికారులు

Haryana

Viral Video :  ఎక్కడో ఉన్న పులిని చూస్తేనే మనకు గుండెల్లో వణుకు మొదలవుతుంది. అలాంటిది మన ఎదురుకుండా వచ్చిందటే ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి. పైప్రాణాలు పైనే పోతాయి. హర్యానాలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులపైకి ఒక చిరుతపులి దాడి చేసింది.

అందరిలాగా వారు పారిపోకుండా దానిపై ఎదురు దాడికి దిగి దాన్నిపట్టుకోవాలని చూశారు… కానీ పులి వారిని గాయ పరిచింది. ఈ ఘటనలో ఇద్దరు అటవీ శాఖ అధికారులు, ఒక పోలీసు గాయపడ్డారు. హర్యానాలో ఆదివారం జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకివెళితే… రాష్ట్రంలోని పానిపట్ జిల్లా బెహ్రంపూర్ గ్రామంలో చిరుతపులి సంచరిస్తోంది. గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ శాఖ, పోలీసు శాఖ అధికారుల బృందం చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టింది. ఆదివారం గ్రామంలో చిరుతపులి కోసం వేచి ఉండగా అది… పోలీసులూ, అటవీశాఖ అధికారులపైకి దూకింది.

ఈక్రమంలో పోలీసులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఒక కానిస్టేబుల్ తన వద్ద ఉన్నలాఠీతో దాన్ని కొట్టబోయాడు. మరో ఇద్దరు దాన్ని పట్టుకునేందుకు ముందుకు రాగా వారిపై దాడి చేసి తప్పించుకుపోయింది. అయినప్పటికీ అధికారులు ఎట్టకేలకు చిరుతపులిని సజీవంగా బంధించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను శశాంక్ కుమార్ సావన్ అనే పోలీసు అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. పోలీసులు అటవీశాఖ అధికారులకు విధినిర్వహణలో కష్టమైన రోజు . ఈ ఆపరేషన్ లో ముగ్గుర అధికారులు గాయపడ్డారు. వారి ధైర్య సాహసానికి సెల్యూట్. చివరికి చిరుతపులితో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు అని వ్యాఖ్యానించారు.

Also Read : Nellore : యువతిని తుపాకీతో కాల్చి చంపిన ప్రేమోన్మాది