Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఉచిత ‘యోగా శిక్షణ’.. భక్తులకు దుర్గ గుడి ఈవో సువర్ణావకాశం.. ఉచిత ప్రసాదం పంపిణీ
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ(Vijayawada) దుర్గ గుడిలో 14 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
- V Santhosh Kumar
- Published on- June 6, 2026 / 07:44 PM IST
Free yoga training at Vijayawada Durga Temple starting tomorrow.
- ఇంద్రకీలాద్రిపై ఉచిత యోగా శిక్షణ.
- 14 రోజుల పాటు ప్రత్యేక తరగతులు.
- భక్తులందరికీ ఉచిత ప్రసాదం పంపిణీ.
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునే భక్తులకు, ఆలయ ఉద్యోగులకు దుర్గ గుడి అధికారులు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కొండపై 14 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగనుంది.
Hyderabad: ఓయో రూమ్స్, హోటల్స్ కి వెళుతున్నారా.. ఇకనుంచి అవి తప్పనిసరి.. ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్
ఈ శిక్షణ తరగతులు ప్రతిరోజు ఉదయం 7:00 గంటల నుంచి 8:00 గంటల వరకు ఇంద్రకీలాద్రిపై ఉన్న మహామండపం ఆరో అంతస్తులో జరుగుతాయి. అనుభవజ్ఞులైన యోగా నిపుణులు భక్తులకు సరైన పద్ధతిలో ఆసనాలు, ప్రాణాయామం నేర్పిస్తారు. ఈ ఉచిత శిబిరానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో దేవస్థానం ఇప్పటికే అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేసింది.
శిక్షణలో పాల్గొనే భక్తుల వివరాలను నమోదు చేయడంతో పాటు, ప్రతిరోజూ యోగా సాధన ముగిసిన తర్వాత వారికి (Vijayawada)దేవస్థానం తరపున ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
