×
Ad

BC Reservations: బీసీ రిజర్వేషన్ల పెంపుపై కూటమి బిగ్ ప్లాన్..! ఏంటీ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా?

గత సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయంతో బీసీలు ఎన్నో పదవులు కోల్పోయారని..తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో..బీసీ కోటా పెంపుకోసం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.

  • Published On : February 20, 2026 / 08:28 PM IST

Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)

  • మ‌రో కీలక హామీ అమలు దిశగా చంద్రబాబు కీలక నిర్ణయం
  • లోకల్ బాడీస్‌లో బీసీల‌కు 34 శాతం రిజర్వేషన్లపై కసరత్తు..
  • బీసీ కోటా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్‌ ఏర్పాటు
  • బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలకు?
  • కోటా పెంపు కోసం ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా?

 

BC Reservations: స్థానిక పోరుకు కసరత్తు స్పీడప్ అయింది. ఏప్రిల్‌లోపు ఎన్నికలకు వెళ్తారని అప్ డేట్స్ వస్తున్న వేళ..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీస్‌లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది కూటమి ప్రభుత్వం. బీసీ కోటా పెంపు సాధ్యాసాధ్యాలు, న్యాయ సమస్యల అధ్యయనానికి కమిషన్‌ వేసింది సర్కార్. బీసీ కోటా ఇంప్లిమెంట్‌ చేసే ఎన్నికలకు వెళ్తారా? రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా?

ఏపీలోనూ స్థానిక పోరు ఊరిస్తోంది. జూన్‌లోగా లోకల్ బాడీస్‌ అన్నింటికి ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది కూటమి సర్కార్. ఇంతలోనే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జట్పీడీసీ, జడ్పీ ఛైర్మన్ల సీట్లలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని అనుకుంటుంది. బీసీలకు రాజకీయంగా మేలు చేసే ఉద్దేశంతో ఏకంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది.

కమిషన్ కు 45 రోజుల కాల పరిమితి..

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది సర్కార్. ఈ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. 45 రోజుల్లో నివేదికను ఇవ్వాలని కూడా ఏకసభ్య కమిషన్‌కు కాల పరిమితిని విధించింది సర్కార్. కమిషన్‌ ఇచ్చే రిపోర్ట్‌ను బేస్ చేసుకుని బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం డెసిషన్ తీసుకోనుంది.

వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికే పరిమితం చేసిందని చెబుతోంది కూటమి సర్కార్. గత సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయంతో బీసీలు ఎన్నో పదవులు కోల్పోయారని..తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో..బీసీ కోటా పెంపుకోసం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. లోకల్ బాడీస్‌లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు..ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామంటున్నారు. టీడీపీ అంటేనే బీసీల పక్షపాతి అని..పదవుల్లో బీసీలకు వాటా కోసం సీఎం చంద్రబాబు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

వైసీపీ బీసీల గొంతు కోసేలా 24 శాతమే వారికి అమలు చేస్తే తాము మరో పది శాతం పెంచి బీసీ రిజర్వేషన్లు ఇప్లిమెంట్‌ చేసేలా చర్యలు చేపట్టామంటున్నారు. అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో కీలక పాత్ర దక్కాలన్నదే చంద్రబాబు ఆలోచన అంటున్నారు. అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న మాట ప్రకారం..ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు నియమించారని చెబుతున్నారు.

ట్రంప్ కార్డుగా వాడుకునే ప్లాన్..

అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బీసీలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుని ఎన్నికలకు వెళ్తే తమకు ఇంకా అడ్వాంటేజ్‌ మారుతుందని..బెటర్ రిజల్ట్స్‌ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగూ అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తుంటాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ట్రంప్ కార్డుగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.

అయితే రిజర్వేషన్లు పెంపు హామీకి కూటమి సర్కార్‌ కట్టుబడి ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డుగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే..బీసీ రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు తెచ్చి పెడుతోంది. ఏపీలో ఇప్పటికే బీసీలకు 24 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. దీనిని 34 శాతానికి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరి సుప్రీంకోర్టు పెట్టిన కోటా దాటిపోనుంది.

ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పెట్టిన పరిమితిని దాటాలని ప్రయత్నించినా, లీగల్ సమస్యలు వచ్చి కోర్టుల్లోనే ఆగిపోయిన పరిస్థితి. అయితే ఈ సమస్యలన్నింటిని దృష్టిలో పెట్టుకునే బీసీ రిజర్వేషన్ల పెంపునకు ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను ఫాలో అయ్యే ఆలోచనలో ఉందట కూటమి సర్కార్. అందుకే ముందుగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని అంటున్నారు.

చట్టపరమైన సమస్యలు రాకుండా..

ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా సూచనలు ఇవ్వాలని ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్‌కు సూచించింది ప్రభుత్వం. ఒకవేళ కమిషన్‌ రిపోర్ట్‌ బేస్ చేసుకుని జీవోనో, ఆర్డినెన్సో జారీ చేస్తే..లీగల్‌ సమస్యలు వచ్చినా కేంద్రంతో చర్చించి బీసీ కోటా పెంపునకు లైన్‌ క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారట కూటమి పెద్దలు. ఒకవేళ చట్టపరంగా రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు వస్తే..పార్టీ పరంగా బీసీలకు అధిక సీట్లు కేటాయించే యోచనలో కూడా ఉన్నారట. ఏపీలో బీసీ కోటా అమలు సాధ్యమవుతుందో లేదో చూడాలి.

Also Read: నువ్వు దేవుడు సామీ..! వాటర్ సిస్టమ్‍ను బాగు చేసేందుకు 21 కేజీల బంగారం విరాళం