Cm Chandrababu Naidu Representative Image (Image Credit To Original Source)
Cm Chandrababu: ఇలా వదిలేస్తే కుదరదు. కాస్త స్ట్రాంగ్‌గానే రిప్లై ఇద్దాం. సిట్ చెప్పిందేంటో..వైసీపీ చేసుకుంటున్న ప్రచారంలో నిజమెంతో ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందే. ఎవరికి వారుగా కాదు కలిసి ముందుకెళ్దాం. గట్టిగా ఇచ్చిపడేద్దామని ఫిక్స్ అయిపోయింది కూటమి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి త్రీమెన్ కమిటీని ఫామ్ చేసి..కల్తీ నెయ్యిపై ఎపిసోడ్‌పై స్పెషల్ కాన్సన్‌ట్రేషన్ చేయాలని డిసైడ్ అయ్యారట. అసలు కూటమి నెక్స్ట్ ప్లానేంటి? కల్తీ నెయ్యి ఇష్యూకు కన్‌క్లూజన్ ఎప్పుడు?
ఏపీ పాలిటిక్స్‌లో కొద్దిరోజులుగా కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పెషల్ సిట్ సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సబ్‌మిట్ చేయడంతో..ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. అప్పటికే రగులుతున్న ఏపీ పాలిటిక్స్‌లో సిట్ నివేదిక అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. అప్పటినుంచి వివాదం సరికొత్త మలుపు తీసుకుంది. ఏకంగా కూటమిపై వైసీపీ ముప్పేట విమర్శల దాడికి దిగడమే కాదు..జంతువుల కొవ్వు అంటూ చేసిన వ్యాఖ్యలన్నీ తప్పేనని తేలిపోయిందని అటాక్ స్టార్ట్ చేసింది.
చంద్రబాబు, పవన్ గతంలో చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు దుమ్మెత్తిపోస్తూ వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ సానుభూతిపరులు, ఫ్యాన్ పార్టీ ముఖ్య నేతలకు తగ్గేదేలే అంటూ కూటమి టార్గెట్‌గా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇంతలోనే మాజీమంత్రి అంబటి రాంబాబు నోరు జారడం..ఆయన ఇంటిపై దాడి, వెంటనే అంబటి అరెస్ట్ ఇలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయ్. ఈ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ కావాలో..కూటమి పెద్దలకు అర్థం కాని పరిస్థితి. కాస్త టైమ్ తీసుకుని అన్ని విషయాలను గమనించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అటాక్ మోడ్‌లోకి దిగిపోయారు.
ఇదే టైమ్‌లో అధికార కూటమి పార్టీల మధ్య సరికొత్త ఐక్యతకు రూట్ వేశారు. వైసీపీ విమర్శలు, సిట్ రిపోర్ట్, వైసీపీ నేతల ఇళ్లపై దాడి..ఇలాంటి అంశాల మధ్య కాస్త డిఫెన్స్ పడ్డట్లు కనిపించిన టీడీపీ, జనసేన, బీజేపీలు ఎదురుదాడికి దిగాయి. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల సెంటిమెంట్‌కు సంబంధించిన అంశంగానే కాకుండా, రాజకీయ అస్తిత్వ పోరాటంగా మారింది. స్టార్టింగ్‌లో ఈ విషయంలో కొంత తడబడినట్లు కనిపించిన అధికార కూటమి..ఇప్పుడు ఫుల్ అలర్ట్ అయి వైసీపీ అలిగేషన్స్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏకంగా కూటమి పార్టీల ముఖ్యనేతల సమావేశం..చంద్రబాబు, పవన్, పీవీఎన్ మాధవ్ మీడియా బ్రీఫింగ్ చూసిన తర్వాత..కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో సీరియస్ యాక్షన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
సిట్ రిపోర్ట్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను అస్త్రాలుగా చేసుకుని వైసీపీ దూకుడు పెంచింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ చేస్తున్న డిమాండ్లు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని కూటమి రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తోంది. కేవలం ప్రభుత్వపరంగానే కాకుండా, రాజకీయంగా కూడా గట్టి సమాధానం ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని..ఉమ్మడిగా మీడియా ముందుకు రావడం కీలక మలుపుగా మారింది. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మూడు పార్టీల ప్రతినిధులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం కూడా వ్యూహంలో భాగమే అంటున్నారు.
గ్రౌండ్ లెవల్‌లో ప్రజలకు కల్తీ జరిగిన తీరును, గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్ల ప్రక్రియను వివరించాలని డిసైడ్ అయ్యారట. సిట్ చెప్పిందేంటి..వైసీపీ చేసుకుంటున్న ప్రచారమేంటన్న దానిపై కూడా ప్రజలకు నేరుగా ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పాటు, సోషల్ మీడియాలో విపక్షాలు చేస్తున్న నెగటివ్ ప్రచారాన్ని మూడు పార్టీల ఐటీ విభాగాలు సమన్వయంతో తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నారట.
సిట్ రిపోర్ట్‌పై వైసీపీ హడావుడి చేస్తోందని, వాళ్ల ప్రచారాన్ని అదే స్థాయితో తిప్పికొట్టేందుకు వ్యూహరచన సిద్ధం చేశారట. ప్రభుత్వం వాయిస్‌గా కంటే కూటమి నేతల గళం బలంగా వినిపిస్తేనే వైసీపీని దూకుడును కంట్రోల్ చేయొచ్చని భావిస్తున్నారట. కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో అసలు నిందితులను వదలొద్దని..స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేలా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారట. ఈ అంశంలో కూటమి పార్టీల మధ్య కోఆర్డినేషన్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసి..సమన్వయంతో ముందుకెళ్లాలనే ఆలోచనకు వచ్చారట.
మొదట మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, కందుల దుర్గేశ్‌తో కమిటీ వేయాలని భావించారట. అయితే, ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో మంత్రులు బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో మూడు పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలతో కమిటీ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారట. ఓవరాల్‌గా వైసీపీ దూకుడుకు బ్రేకులు వేసేలా..అటాక్ మోడ్‌లో వెళ్లాలనేది కూటమి పెద్దలు ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఉమ్మడి పోరాటం కేవలం కల్తీ నెయ్యి అంశానికే పరిమితం కాకుండా, భవిష్యత్‌లో రాజకీయ అంశాలు, ఎన్నికల సమరం.. ఐక్య పోరాటానికి టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.
Also Read: సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి గొప్పదా? స్వార్ధ రాజకీయాల కోసమే దుష్ప్రచారం- జగన్