Dorababu Vs Varma: పిఠాపురంలో వర్మ వర్సెస్ దొరబాబు.. ఆ ఇద్దరి ఫైట్‌ ఎందుకు? అసలు ఎజెండా వేరేనా?

దొరబాబు పిఠాపురంలో వైసీపీ కోవర్టు అని వర్మ అంటుంటే..వర్మ చీకటి బాగోతాలు అంటూ దొరబాబు రచ్చకు తెరలేపారట. అయితే ఈ ఇద్దరిది సీరియస్‌ ఫైట్‌ కాదని..

  • Published on- April 22, 2026 / 08:25 PM IST

Dorababu Vs Varma: ఇంటెన్షన్ వేరు. ఫీల్‌ అవుతున్నది కూడా అందుకోసం కాదు. కానీ ఫైట్‌ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. జస్ట్‌ లైక్‌ ఓ సినిమా కామెడీ ఎపిసోడ్‌ను మించి క్యామియో రోల్‌తో కలరింగ్ ఇస్తున్నారట ఆ ఇద్దరు నేతలు. అధినేత ఫోటో ఎక్కడ. ఇదే ఇప్పుడు ఓ నేత క్యారెక్టర్ ఎలివేషన్‌కు అస్త్రంగా మారిందట. తనకు పదవి రాలేదన్న ఫ్రస్ట్రేషన్‌ను నేరుగా బయట పెట్టలేక.. సీఎం ఫోటో కోసమే తన ఆరాటం అన్నట్లుగా హిట్టింగ్ స్పీడప్ చేశారట. మరో జనసేన నేత కూడా రచ్చలో గిచ్చి మరీ జోలపాడుతున్నారట. ఇంతకు ఆ ఇద్దరి ఫైట్‌ ఎందుకు? తమ అసంతృప్తిని కూటమిలో కుంపటిగా మారుస్తున్నదెవరు?

ఆయన ఆవేదన వేరు. అసంతృప్తిని వెళ్లగక్కుతున్నది మరో తీరు. ఇది పిఠాపురం వర్మ స్టైల్‌ అన్నట్లుగా మారిందట ఆ నేత రోల్. SVSN వర్మ. ఏపీలో కూటమిలో భాగంగా పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన నేతగా పేరు తెచ్చుకున్న ఆయన..అప్పుడప్పుడు న్యూస్‌ ఇంట్రెస్టింగ్ సీన్స్‌కు తెరలేపుతున్నారట. జనసేనాని కోసం టికెట్‌ వదులుకోవడం వల్ల ఆయనకు ఓ రేంజ్‌లో ఎలివేషన్‌ వచ్చినా..ఆ తర్వాత పొలిటికల్ మైలేజ్‌ మాత్రం జీరో అన్నట్లు అయిపోందట. ఎమ్మెల్సీ అని..నామినేటెడ్‌ పోస్ట్ అని.. ఇలా ఎన్నో లీక్స్ వచ్చినా..ఇప్పటివరకు ఆయనకు ఏ పదవి దక్కలేదు. దీంతో అప్పుడప్పుడు ఆయనలోని అసంతృప్తిని క్యామియో రోల్‌లో చూపిస్తున్నారట.

సీటు త్యాగం చేసినా ఏ పదవి రాలేదనే ఫ్రస్ట్రేషన్‌?

నిజానికి వర్మకు ఎలాంటి ప్రోటోకాల్ లేదు. పిఠాపురంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అక్కడే ఏదో ఒక టాపిక్‌ను ఎత్తుకుని..ఇదేం పద్దతి అంటూ అధికారులపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఓసారి ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటోను చిన్నగా వేశారని అధికారులపై ఆయన సీరియస్‌ అవడం పొలిటికల్‌ హాట్ టాపిక్‌ అయింది. ఇప్పుడు మరోసారి పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ రాద్ధాంతం చేశారు.

అయితే ఇప్పటికి రెండుసార్లు సీఎం చంద్రబాబు ఫోటో కోసమే వర్మ గళం వినిపిస్తున్నట్లు పైకి ప్రచారం జరుగుతున్నా ఆయన మాటల వెనుక మర్మమేంటన్నది ఎవరికి అంతుచిక్కట్లేదట. సీటు త్యాగం చేసినా..తనకు ఏ పదవి రాలేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న వర్మ..తన అసంతృప్తిని మరో రూపంలో బయటపెడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుగా తన ఆవేదనను నిరసనగా మార్చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.

ఇక వర్మ బాధ ఒకటి అయితే..జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కథ మరోలా ఉందట. 2004లోనే ఆయన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో జగన్‌ దగ్గర ఆయన మాట బాగా చెల్లుబాటయ్యేదన్న టాక్ ఉంది. ఆ తర్వాత 2019లో వంగా గీతకు వైసీపీకి టికెట్ ఇవ్వగా.. ఆమె గెలుపు కోసం పనిచేసినా విజయం దక్కలేదు. 2024 ఆగస్ట్‌లో పెండెం దొరబాబు జనసేనలో చేరిపోయారు. ఆయన కూడా టూ టైమ్స్‌ ఎమ్మెల్యే, పైగా సీనియర్ లీడర్..ఈ నేపథ్యంలో తనకు కూడా ఏ పదవి లేకపోవడం ఆయన మదిని తొలిచేస్తుందట. అందుకే వర్మకేనా ఎలివేషన్‌..పిఠాపురంలో తాను కూడా ఉన్నానంటూ ఇది దొరబాబు సవాల్‌ అంటూ రెచ్చిపోతున్నారట. ఈ క్రమంలోనే ఏకంగా వర్మను టార్గెట్‌ చేసి పవన్‌ మదిలో చోటు కోసం ఆరాట పడుతున్నారట.

బెర్త్ కోసమే ఈ రచ్చ..!

దొరబాబు పిఠాపురంలో వైసీపీ కోవర్టు అని వర్మ అంటుంటే..వర్మ చీకటి బాగోతాలు అంటూ దొరబాబు రచ్చకు తెరలేపారట. అయితే ఈ ఇద్దరిది సీరియస్‌ ఫైట్‌ కాదని..ఏదో ఒక బెర్త్ కోసమే రచ్చ చేస్తున్నారని పిఠాపురం పబ్లిక్‌లో చర్చ జరుగుతోందట. వర్మ త్యాగానికి ఏదో ఒక పదవి దక్కితే బాగుండనే చర్చ అందరిలో ఉన్నా..దొరబాబు ఎపిసోడ్‌పై జనంలో డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయట.

రాజకీయ నాయకులు ఏదీ డైరెక్ట్ గా చెప్పరు. పొలిటికల్ లీడర్ల మాటల వెనుక మర్మం వేరులే అన్న ఒపీనియన్ ఉండనే ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరి నేతల విమర్శలు, ప్రతి విమర్శల వెనుక పకడ్బందీ స్కెచ్ ఉందట. బాబు మదిలో చోటును పదిలం చేసుకునే ప్రయత్నంలో వర్మ..జనసేనాని మెప్పుకోసం దొరబాబు..రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారట. ఇలా ఆ ఇద్దరి అసంతృప్తికి, ఆవేదనకు కారణం వేరైనా..కంటెంట్‌ మాత్రం బాగుందన్న డిస్కషన్ నడుస్తోంది.