Pawan Kalyan – Gen Z: టార్గెట్ జెన్‌జీ.. యువతను అట్రాక్ట్ చేసేలా పవన్ కల్యాణ్ పకడ్బందీ వ్యూహం..
ఎన్నికలకు ఇంకో మూడేళ్ల టైమ్ ఉంది. మళ్లీ ఆ రేంజ్ విజయం దక్కుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ పార్టీ అనేది లాంగ్ రన్‌లో నడవాల్సిందే.
- Naveen
- Updated on- May 15, 2026 / 05:39 PM IST
- కొత్త తరం ఆశలు, ఆకాంక్షలకు ప్రయారిటీ
- జెన్ జీ ఆలోచనలకు తగ్గట్లుగా రాష్ట్ర కమిటీ
- సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై సేనాని ఫోకస్
- 175 నియోజకవర్గాలకు ఇంచార్జ్ నియమించే ప్లాన్
Pawan Kalyan – Gen Z: లేటెస్ట్ ట్రెండ్..ఫ్యూచర్ ప్లానింగ్. జెన్-జీ సెంట్రిక్‌గా సేనాని పొలిటికల్ స్కెచ్‌లు..నడుస్తూనే ఉన్నాయి. జెన్ జీ ఆలోచనలకు తగ్గట్లుగా నెక్స్ట్ టర్మ్ పాలిటిక్స్ చేసేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందే జెన్ జీపై ఫోకస్ పెట్టిన ఆయన..నవ యువతను పార్టీకి పునాదిగా చేసుకునే స్కెచ్ వేస్తున్నారు. సేమ్‌టైమ్ జెన్ జీ టార్గెట్‌గా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పార్టీ కార్యవర్గ సభ్యులను కూడా జెన్ జీ ఆలోచనలకు తగ్గట్లుగా నియమిస్తారని అంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్‌పై పవన్ థాట్ ఏంటి?
మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్రైక్ రేటు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీలు గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేశారు జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అయితే 2024 ఎన్నికల రిజల్ట్ ప్రత్యేకం. ఎన్నికలకు ఇంకో మూడేళ్ల టైమ్ ఉంది. మళ్లీ ఆ రేంజ్ విజయం దక్కుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ పార్టీ అనేది లాంగ్ రన్‌లో నడవాల్సిందే. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ముందుకెళ్తేనే ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే పార్టీకి బలమైన పునాదులు వేసే ప్లాన్ చేస్తున్నారు పవన్.
జెన్ జీ సెంట్రిక్‌గా జనసేన కమిటీలు..!
నెక్స్ట్ జనరేషన్ థాట్స్‌కు తగ్గట్లుగా..వారి ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని రన్ చేస్తూ..ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు..ముఖ్యంగా యువతను అట్రాక్ట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఓసారి జెన్ జీతో సమావేశమై వారితో ఇంటరాక్ట్ అయ్యారు పవన్. ఇప్పుడు జనసేన కమిటీలను కూడా జెన్ జీ సెంట్రిక్‌గానే ఏర్పాటు చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. కొత్త తరం యువత పల్స్‌ను పట్టుకుని..పార్టీని గ్రాస్ రూట్ లెవల్ వరకు పటిష్టం చేసేలా అడుగులు వేస్తున్నారు.
జనసేన సంస్థాగత విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పవన్ కల్యాణ్. సర్జరీ తర్వాత దాదాపు 25 రోజుల విశ్రాంతి తీసుకున్న ఆయన మళ్లీ రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వరుస సమీక్షలు చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపడుతున్నారు. పవన్ నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, 175 నియోజక వర్గాల ఇంచార్జ్‌ల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరినట్లు టాక్. పార్టీలో సభ్యత్వ నమోదు, పనితీరు ఆధారంగా పదవులు కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో నలుగురు కొత్త వారికి అవకాశం కల్పించినట్లు జనసేన శ్రేణుల్లో ప్రచారం సాగుతోంది. జెన్ జీ కలలకు తగ్గట్టుగా కొత్త కమిటీని ఒకటి రెండ్రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 500కు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన దాదాపు 1,500 మందితో పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు పార్టీ కమిటీలను అధికారికంగా ప్రకటించి, కొత్తగా ఎంపికైన నాయకులతో సమావేశం నిర్వహిస్తారని అంటున్నారు.
ఏ రాజకీయ పార్టీ అడుగులు వేయని విధంగా…
జెన్ జీ సెంట్రిక్‌గానే జనసేన వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు యంగ్ లీడర్లే రాజకీయాల్లో కీరోల్ ప్లే చేస్తున్నారు. ప్రభుత్వాలను గద్దె దించేందుకు తమ ఆందోళనలతో యావత్ దునియా దృష్టిని ఆకర్షిస్తున్న జెన్ జీపై పవన్ స్పెషల్ కాన్సన్‌ట్రేషన్ పెట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అడుగులు వేయని విధంగా..అందరి కంటే ముందే జెన్ జీ అట్రాక్ట్ చేసేలా పొలిటికల్ వ్యూహాలకు తెరలేపారు పవన్. పార్టీ కమిటీల్లోనూ వారి ఆలోచనలను అనుగుణంగా పనిచేసే వారికే చోటు కల్పించేందుకు రెడీ అవుతున్నారు.
యువతకు నియోజకవర్గ ఇంచార్జ్ లుగా బాధ్యతలు..
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారట. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జెన్ జీ ఆలోచనలను అర్థం చేసుకోవాలని లీడర్లకు నొక్కి చెప్తున్నారట పవన్. కొత్త తరం యువత సరికొత్తగా ఆలోచిస్తోందని..వారిని పార్టీకి దగ్గర చేయాలనేది సేనాని ఆలోచనగా చెబుతున్నారు. అందుకే జెన్ జీ జపం చేస్తున్నారని అంటున్నారు. పార్టీ కార్యవర్గంలో, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు కూడా జెన్ జీ థాట్స్‌కు అనుగుణంగా పనిచేసే నాయకులు ఉండాలనేది పవన్ ప్లాన్ అంటున్నారు. అందుకే ప్రతీ జిల్లాల్లో కనీసం ముగ్గురు, నలుగురు యంగ్ లీడర్లకు, పైగా విద్యావంతులైన మహిళలకు నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారట.
ఇలా అయితే గ్రౌండ్ లెవల్ వరకు పార్టీని పటిష్టం చేయడం ఈజీ అవుతుందని పవన్ భావిస్తున్నారట. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు పార్టీ బాధ్యతలు, పదవులు అప్పగించడం కంటే..జెన్ జీని అట్రాక్ట్ చేసేలా యంగ్ లీడర్లకు ఫీల్డ్‌లోకి దించేందుకు సేనాని వ్యూహాలకు పదును పెడుతున్నారట. జెన్ జీ సెంట్రిక్‌గా పవన్ వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read: మహానాడుకు మించి.. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు వైసీపీ వేసిన బిగ్ స్కెచ్ ఏంటి..!
