Tdp: పదవుల పంపకం.. తీవ్ర అసంతృప్తిలో తమ్ముళ్లు.. ఎందుకు.. టీడీపీ అధిష్టానం ఏం చేయనుంది?
టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో..ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉన్న అసంతృప్తి బయటపడిందని అంటున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట సైకిల్ పార్టీ నేతలు.
- Naveen
- Published On : April 2, 2026 / 06:40 AM IST
- లీడర్లకు పదవులు..టీడీపీ పెద్దలకు సవాళ్లు.!
- వైసీపీ లీడర్లకు పోస్ట్‌లు..టీడీపీ నేతల అసంతృప్తి
- ఫిర్యాదులు అందడంతో టీడీపీ అధిష్టానం అలర్ట్.!
- చంద్రబాబు, లోకేశ్ కామెంట్స్ వెనుక మర్మం అదేనా.?
Tdp: పవర్‌లో ఉన్నారు. పైగా అలయన్స్‌లో కొనసాగుతున్నారు. దీంతో పార్టీ పదవి అయినా..ప్రభుత్వ పోస్ట్ కోసమైనా..సైకిల్ పార్టీలో రేసు నెక్స్ట్ లెవల్‌లో నడుస్తోంది. ఓవైపు సీనియారిటీ..మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్..అన్నీ సెట్ చేయడం టీడీపీ హైకమాండ్‌కు సవాల్‌గా మారింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏంటన్న అసంతృప్తి వ్యక్తం అవుతోందట. ఒకటి రెండు చోట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయట. అలర్ట్ అయిన టీడీపీ హైకమాండ్..ఇక నుంచి అలా జరగదు..మాది భరోసా అంటూ లీడర్లకు కాన్ఫిడెన్స్ ఇస్తోందట. పదవుల విషయంలో ఏం జరుగుతుంది? వలస నేతలను ఎలా అకామిటేడ్ చేయనున్నారు?
కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు అయిపోతుంది. పవర్‌లోకి వచ్చాం సరే..పదవుల మాటేమిటని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. నామినేటెడ్ పోస్ట్ అయినా, పార్టీ పదవి అయినా..పార్టీ కోసం పనిచేసిన వారికే ఇవ్వాలంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు..ఆ తర్వాత వైసీపీతో సహా వివిధ పార్టీల నుంచి వచ్చి టీడీపీలో చేరిన లీడర్లకు..పదవులు దక్కుతుండటం..తెలుగు తమ్ముళ్లకు ఏ మాత్రం మింగుడు పడటం లేదట. అసలే కూటమి పొత్తులో భాగంగా షేరింగ్‌లో పదవులు దక్కడం లేదన్న ఫీలింగ్‌లో ఉంటే..వలస నేతలను పెద్దపీట వేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
వైసీపీ నుంచి వచ్చినోళ్లకు పదవులా?
మరీ ముఖ్యంగా వైసీపీ లీడర్లకు పదవులు కట్టబెట్టడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక ..అధిష్టానంకు ఫిర్యాదులు చేస్తున్నారట. జంపింగ్‌లను నమ్మి పదవులు కట్టబెడితే పార్టీని ముంచేస్తారని చెబుతున్నారట. దీంతో పార్టీ, లోకల్‌గా నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ హైకమాండ్ ఒత్తిళ్లు ఫేస్ చేయాల్సి వస్తోందట. ఓవైపు సీనియర్లు..ఇంకోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్, మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డోళ్లు, పార్టీని నమ్ముకుని వచ్చిన నేతలు ..ఇలా అందరికి పదవులు ఇవ్వడం ఇబ్బందిగానే ఉందట.
టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో..ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉన్న అసంతృప్తి బయటపడిందని అంటున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట సైకిల్ పార్టీ నేతలు. పార్టీలో సంస్థాగతంగా పదిహేను ఏళ్ల నుంచి సేవ చేస్తున్నామని..ఆస్తులను అమ్ముకుని కూడా పార్టీ కోసం ఖర్చు చేసిన నాయకులు ఉన్నారని, అలాంటి వారికి పదవులు ఇవ్వాలని సూచించారట. క్షేత్రస్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు వంటి పదవులను వైసీపీ నుంచి వచ్చిన కొందరికి ఎమ్మెల్యేలు సిఫారసు చేయటంపై అసంతృప్తి వ్యక్తం చేశారట. తమ ఎమోషన్స్‌కు విలువ ఇవ్వకుండా పదవులు ఇచ్చేస్తే ఎలా అని క్వశ్చన్ చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికే పదవులు ఇవ్వాలని డిమాండ్..
ఒకటి రెండు చోట్ల నుంచి పార్టీకి ఫిర్యాదులు కూడా అందాయట. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పార్టీపై ప్రేమ ఉంటుందా? లేక పదవులపైనే ప్రేమ ఉంటుందో అధిష్టానం ఆలోచించుకోవాలని కూడా సూచనలు చేశారట. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారట. అయితే ఎమ్మెల్యేల సిఫారసులకే పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడంతో సమస్య వచ్చి పడిందంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పొరపాట్లు జరిగాయని అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ అలర్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది.
ఇక నుంచి అలా జరగదు. మాది భరోసా అంటూ లీడర్లకు భరోసా ఇచ్చారట చంద్రబాబు, లోకేశ్. పార్టీ కోసం పని చేసేవాళ్లకే పదవులు ఇస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్లకే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత. కార్యకర్తలను దూరం పెట్టే నేతలను తాను దూరం పెడతానని తేల్చి చెప్పడం వెనుక కారణం అదేనంటున్నారు. కష్టపడే కార్యకర్తలను, నేతలను గుర్తించే బాధ్యత లోకేశ్‌దేనని చెప్పారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ హెచ్చరించడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. క్యాడర్, లీడర్లే టీడీపీ భవిష్యత్ నాయకులన్న లోకేశ్..గ్రామ స్థాయి నాయకుడు బాగా పనిచేస్తే పొలిట్ బ్యూరోలో కూర్చోబెడుతామంటున్నారు. రాబోయే పొలిట్ బ్యూరోలో మీరు ఆ మార్పును చూడబోతున్నారని కూడా చెబుతున్నారు.
మొత్తం మీద లీడర్ల నుంచి వచ్చిన సజీషన్స్‌ను విన్నాకే..వలస నేతలు..ఎస్పెషల్‌గా వైసీపీ నుంచి వచ్చిన లీడర్ల విషయంలో అలర్ట్‌గా ఉండాలని లోకేశ్ సూచించారని అంటున్నారు. క్యాడర్ ఆలోచనకు తగ్గట్లుగా టీడీపీ అధిష్టానం వాయిస్ వినిపించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read: ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లు.. వైసీపీది మళ్లీ అదే టోన్.. నెక్స్ట్ ఏం జరగబోతోంది?
