TVK Vijay: రిజల్ట్ అక్కడ, రీసౌండ్ ఇక్కడ..! కేసీఆర్, పవన్, రోజాపై ట్రోల్స్ ఎందుకు? విజయ్ విజయంపై ఇక్కడెందుకు ఇంత చర్చ?
తమ అధినేత ఫోటో పెట్టుకుని విజయ్ గెలిచారన్నట్లుగా ఫ్యాన్ పార్టీ కలరింగ్ ఇస్తే..టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. జగన్ ఫోటో పెట్టుకుని విజయ్ గెలిస్తే..జగనే అధ్యక్షుడిగా ఉండి వైసీపీని ఎందుకు 11 సీట్లకే పరిమితం చేశారో చెప్పాలని కూటమి నుంచి అటాక్ స్టార్ట్ అయింది.
- Naveen
- Published on- May 5, 2026 / 08:59 PM IST
- తెలుగు స్టేట్స్‌లో రీసౌండ్ చేస్తున్న విజయ్ విజయం..
- టీవీకే విక్టరీతో ఏపీలో నెక్స్ట్ లెవల్ సోషల్ మీడియా ఫైట్
- విజయ్‌తో పోలుస్తూ పవన్‌ను ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థులు
- విజయ్ గెలుపుపై వైసీపీ క్రెడిట్ గేమ్..టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్
- కేసీఆర్ ఎవరెవరిని కలిశారో అందరూ ఓడారంటూ పోస్టులు
- డీఎంకేకు రోజా ప్రచారంపై ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్
TVK Vijay: ఆయన ఎంట్రీనే అదుర్స్. విజయ్ విజయం తమిళనాడు పాలిటిక్స్‌లో హిస్టరీని క్రియేట్ చేసింది. కానీ తెలుగు స్టేట్స్‌లో దళపతి వికర్టీ రీసౌండ్ చేస్తోంది. ఏకంగా అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్‌కు దారితీసింది. ఇక సినీ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి..పాలిటిక్స్‌లోకి వచ్చిన పవన్‌ను..విజయ్ విజయంతో పోలుస్తూ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఇటు కేసీఆర్‌ను కూడా వదలడం లేదు సోషల్ మీడియా. విజయ్ విజయంపై ఇక్కడెందుకు ఇంత చర్చ? టీవీకే గ్రాండ్ విక్టరీ సెంట్రిక్‌గా ఒకరినొకరు ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నట్లు?
పార్టీ పెట్టిన రెండేళ్లలోనే విజయం. ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి రికార్డు విక్టరీ. అందుకే విజయ్ విజయం దేశం మొత్తం రీసౌండ్ చేస్తోంది. తెలుగు స్టేట్స్‌లో అయితే పొలిటికల్ హీట్‌ను..సోషల్ మీడియా ఫైట్‌ను మరో స్టేజ్‌కు తీసుకెళ్లింది. విజయ్ సాధించిన గెలుపుతో అందరూ ఆ క్రెడిట్‌లో భాగమయ్యేందుకు గేమ్ షురూ చేశారు. విజయ్ ప్రచారంలో ఓ అభిమాని జగన్‌తో ఆయన కలిసి ఉన్న ఫోటోను ఇస్తే..విజయ్ ఆ ఫోటోను తీసుకుని జనాలకు చూపించారు. ఆ విజువల్స్‌ను పోస్ట్ చేసి వైసీపీ సోషల్ మీడియా క్రిడెట్ కొట్టేసే ప్లాన్ చేస్తోంది. తమ అధినేత ఫోటో పెట్టుకుని విజయ్ గెలిచారన్నట్లుగా ఫ్యాన్ పార్టీ కలరింగ్ ఇస్తే..టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. జగన్ ఫోటో పెట్టుకుని విజయ్ గెలిస్తే..జగనే అధ్యక్షుడిగా ఉండి వైసీపీని ఎందుకు 11 సీట్లకే పరిమితం చేశారో చెప్పాలని కూటమి నుంచి అటాక్ స్టార్ట్ అయింది. ఇక వైసీపీ మాజీమంత్రి రోజాను కూడా వదిలిపెట్టడం లేదు సోషల్ మీడియా. ఆమె డీఎంకేకు ప్రచారం చేశారని..ఆమె ఎక్కడ అడుగు పెడిగే అక్కడ నాశనమే..ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
జనసేన పెట్టిన పదేళ్ల తర్వాత డిప్యూటీ సీఎం..
ఇక అన్నింటికి మించి పవన్ సెంట్రిక్‌గా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. విజయం అంటే విజయ్‌ది అని..ఒంటరిగా పోటీ చేసి తన బలంతో ..తానే 234 చోట్ల అభ్యర్థినని చెప్పి గెలిచారని హోరెత్తిస్తున్నారు. విజయ్‌తో పవన్‌ను పోలుస్తూ..ఏపీలో జనసేన పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పవన్ డిప్యూటీ సీఎం అయ్యారంటూ ఎద్దేవా చేస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. 21 సీట్లు గెలిచే వంద శాతం స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్న జనసేనాని..విజయ్ సాధించిన విజయం తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా ఉందని..విజయ్ విజయం..పవన్‌కు హెడెక్‌గా మారిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ట్వీట్ చేసి చర్చకు దారితీశారు.
దొర హ్యాండ్ ఎంత దరిద్రమైందో అంటూ ట్రోల్..
సేమ్‌టైమ్ తెలంగాణ మాజీ కేసీఆర్‌ను కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తోంది. విజయ్ పార్టీ పెట్టే ముందు గులాబీ బాస్‌ను కలిశారని..ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులు పెడుతుంది. అయితే గులాబీ పార్టీకి అదే స్థాయిలో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేస్తోంది. స్టాలిన్ నుంచి మమత వరకు..కేజ్రీవాల్ నుంచి పినరయ్ విజయన్ వరకు..కేసీఆర్‌ను కలిసిన అందరూ..చివరకు జగన్ కూడా..సీఎం పదవిని కోల్పోయారని ట్రోల్స్ చేస్తున్నారు. దొర హ్యాండ్ ఎంత దరిద్రమైందో అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది.
ఇలా విజయ్ విజయం చుట్టూ తెలుగు స్టేట్స్‌లో పెద్ద రచ్చే జరుగుతోంది. టీవీకే విక్టరీని తమకు అడ్వాంటేజ్‌గా మలుచుకునేందుకు..ఏపీలో వైసీపీ కార్యకర్తలు, నేతలు టపాసులు కాల్చి, కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. క్రెడిట్ ఫైట్‌లో భాగంగా..ఎవరికి వారు సెల్ఫ్ ఎలివేషన్‌కు ప్రయారిటీ ఇవ్వడంతో వార్ పీక్స్‌కు చేరింది. దీంతో విజయ్ సెంట్రిక్‌గా ఒకరిని టార్గెట్ చేసుకుంటూ మరొకరు పోటాపోటీ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. విజయ్ విజయం చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.
Also Read: విజయ్ కీలక నిర్ణయం.. ఆ పార్టీలతో కలవం.. పొత్తులపై క్లారిటీ.. కలిసొచ్చే పార్టీలివే..
