Vangaveeti Radha: వంగవీటి రాధాకి రాజకీయ మహర్దశ..! చంద్రబాబుతో భేటీ అందుకేనా? హామీ వచ్చేసిందా?
2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా..అప్పటివరకు ఎలాంటి గుర్తింపు పొందలేకపోయారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ..ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు.
- Naveen
- Updated on- April 19, 2026 / 01:47 AM IST
- రాధా పొలిటికల్‌గా మరింత యాక్టీవ్ కాబోతున్నారా?
- ఈసారి రాధాకు చంద్రబాబు నుంచి హామీ వచ్చేసిందా.?
- రాధాను మండలికి పంపాలని సీఎం డిసైడ్ అయ్యారా?
Vangaveeti Radha: వంగవీటి రాధా. ఈ నేమే ఓ బ్రాండ్. తండ్రి పేరుతో వచ్చిన ఇమేజ్‌నే కంటిన్యూ చేస్తూ.. 20 ఏళ్లుగా లైమ్‌టైట్‌లో ఉంటున్నా..ఆయనకు ఏ అవకాశం దక్కలేదు. పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చినా..ఆయనెప్పుడూ పదవుల వెంట పడలేదు. ఏ పార్టీలో ఉన్నా..ఆత్మగౌరవమే ఫస్ట్ ప్రయారిటీగా ఉండే ఆయన. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అందుకు కారణం సీఎం చంద్రబాబు ఆయనను పిలిచి మరీ మాట్లాడటమే. వంగవీటి రాధాకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి? రాధాను మండలికి పంపిస్తారా? ఈసారి రాధాకు రాజకీయ మహర్దశ పట్టబోతోందా?
ఆయనెప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండాలని కోరకోరు. అలా అని పూర్తిగా సైలెంట్‌గా ఉండిపోరు. పొలిటికల్‌గా టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండే వంగవీటి రాధా..ఏపీ పాలిటిక్స్‌లో ఓ సెన్సేషన్. ఒక్కసారి మాత్రమే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన రాధా..20 ఏళ్లుగా ఏదో విధంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. వంగవీటి మోహన్‌రంగా కుమారుడిగా..టాక్ ఆఫ్ ది న్యూస్ ఉండిపోతున్నారాయన. లేటెస్ట్‌గా సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. చంద్రబాబే పిలిచి మరీ రాధాతో మాట్లాడినట్లు టాక్ వినిపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకు టికెట్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రాధా, చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
విజయవాడకు చెందిన కీలక నాయకుడు వంగవీటి రాధాకు మండలి యోగం పట్టనుందా? ఆయనను గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపించబోతున్నారా? అంటే..ఔననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో 40 నిమిషాలకుపైగానే చర్చలు జరిపారు రాధా. సీఎంవో నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా మండలి సీటుపై ఆయనకు హామీ లభించిందన్న చర్చ సాగుతోంది. అయితే..దీనిపై పార్టీ పరంగా కానీ రాధా పరంగా కానీ..ఎలాంటి లీకులు ఇవ్వలేదు.
కూటమి అధికారంలోకి వచ్చినా ఎలాంటి పదవీ దక్కలేదు..
కానీ..2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా..అప్పటివరకు ఎలాంటి గుర్తింపు పొందలేకపోయారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ..ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో రాధా అనుచరులు నిరాశలోనే ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలకు తోడు..కాపు సామాజిక వర్గంలో బలమైన వాయిస్‌గా ఉన్న రాధాకు టీడీపీ రాష్ట్ర నాయకత్వంలో ఏదైనా పదవి దక్కుతుందని భావిస్తున్నారు. కానీ అది కూడా జరగలేదు. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ అధిష్టానం..కాపు సామాజిక వర్గంలో స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్న రాధాకు మంచి అవకాశం కల్పించాలని అనుకుంటోందట.
గవర్నర్ కోటాలో మండలికి పంపించే అవకాశం..
రాధాకు ఈ పదవి..ఈ పోస్ట్ అంటూ ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని..కాదు..నామినేటెడ్ పదవి ఇస్తారని తరచుగా ఎప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం మండలికి రాధా అంటూ కొత్త టాక్ మొదలైంది. రాధా వాయిస్‌ను, ఆయన తండ్రికి ప్రజల్లో ఉన్న మంచి పేరును దృష్టిలో పెట్టుకుని..కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే లెక్కల్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనైతే డిస్కషన్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే వంగవీటిని గవర్నర్ కోటాలో మండలికి పంపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈసారైనా రాధాకు రాజకీయం దక్కుతుందో లేదో చూడాలి మరి.
Also Read: రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ నెల 20న ఖాతాల్లోకి డబ్బులు
