Ysrcp: మహానాడుకు మించి.. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు వైసీపీ బిగ్ స్కెచ్..!
అధినేత జనంలోకి వెళ్లకపోవడంతో లీడర్లు కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. క్యాడర్‌ను ఎవరూ పట్టించుకున్న నాథుడే లేడు అన్నట్లు అయిపోయిందట పరిస్థితి.
- Naveen
- Published on- May 14, 2026 / 10:28 PM IST
- ఇప్పటివరకు ఓ లెక్క..ఇక నుంచి మరో లెక్క
- భారీ బహిరంగ సభతో గ్రౌండ్‌లోకి దిగే ప్లాన్
- మహానాడుకు ధీటుగా వైసీపీ ప్లాన్ అంటూ టాక్
Ysrcp: ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు చెప్పుకోదగ్గట్లుగా పెద్ద సభనో..పబ్లిక్ మీటింగో నిర్వహించలేదు. అప్పుడప్పుడు అధినేత పర్యటనలు తప్ప వైసీపీ బౌన్స్ బ్యాక్ అయ్యేంత గొప్పగా ఏ సమావేశం పెట్టలేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల మూమెంటమ్ స్టార్ట్ అయింది. ఇదే టైమ్‌లో టీడీపీ మహానాడును ఓ రేంజ్‌లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అధికార పార్టీకి ధీటుగా వైసీపీ వేస్తున్న ప్లాన్స్ ఏంటి? ఫ్యాన్ పార్టీ భారీ బహిరంగ సభ పెట్టేందుకు రెడీ అవుతోందా?
పవర్ కోల్పోయి రెండేళ్లు అయింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్ ఉంది. ఇప్పటినుంచి గ్రౌండ్‌లో ఉంటేనే..నెక్స్ట్ ఎలక్షన్ వరకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని లెక్కలు వేసుకుంటుందట వైసీపీ. ఇందులో భాగంగా త్వరలోనే భారీ బహిరంగ సభతో ప్రజల దృష్టి ఆకట్టుకోవడంతో పాటు..ఆ మీటింగ్ నుంచే సమరశంఖం పూరించేలా వ్యూహరచన చేస్తోందట. అయితే ఈ రెండేళ్ల టైమ్‌లో ఏపీ పొలిటికల్ పిక్చర్‌పై వైసీపీ హడావుడి పెద్దగా కనిపించలేదన్నది ఓపెన్ సీక్రెట్. ఆ పార్టీ అధినేత జగన్‌తో పాటు మాజీ మంత్రులు పేర్నినాని, అంబటి రాంబాబు, వైసీపీ కీలక సజ్జల రామకృష్ణా రెడ్డి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అధికార పార్టీపై అటాక్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవల్‌లో ఎలాంటి యాక్టివిటీ లేదు. నియోజకవర్గ ఇంచార్జ్‌లు యాక్టివ్‌గా లేరు. క్యాడర్ నిరాశలోనే ఉండిపోతున్న పరిస్థితి.
పట్టించుకోవడం లేదని రగిలిపోతున్న క్యాడర్..!
విపక్షంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నా.. బౌన్స్ బ్యాక్ కోసం స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్‌తో ఫీల్డ్‌లోకి దిగింది లేదు. జగన్ వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అధినేత జనంలోకి వెళ్లకపోవడంతో లీడర్లు కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. క్యాడర్‌ను ఎవరూ పట్టించుకున్న నాథుడే లేడు అన్నట్లు అయిపోయిందట పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నపుడు..ఇప్పుడు విపక్షంలో కూడా క్యాడర్ గోడును పట్టించుకోవడం లేదని క్యాడర్ రగిలిపోతోదంట.
అయితే ఇన్నాళ్లు అధికారంలోకి వచ్చిన పార్టీకి టైమ్ ఇచ్చారని అనుకున్నా..ఇంకా వైసీపీ దూకుడు పెంచకపోవడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ పొలిటికల్ గ్రౌండ్‌ను కూటమికి ఫ్రీగా వదిలేసిందన్న టాక్ నడుస్తోంది. దాంతో కూటమికి ఎదురే లేదన్న రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. చర్చ అంతా కూటమి వైపు నుంచే సాగుతోంది. విపక్షం అసెంబ్లీలో లేదు..ప్రజల్లో లేదన్నది కూటమి వాదన. ఈ పరిస్థితి ఏర్పడడానికి వైసీపీ అధినాయకత్వం తీరే రీజన్ అన్న టాక్ నడుస్తోంది.
టీడీపీ మాత్రం ప్రతీ ఏటా మహానాడును పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తోంది. ఇది పార్టీ క్యాడర్‌లో ఎక్కడా లేని జోష్‌ను నింపుతోంది. ఈ సారి నెల్లూరులో టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే టీడీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా వేసింది. దాంతో పదవులు అందుకున్న వారంత మరింత జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ రీచార్జి అవుతూ స్థానిక ఎన్నికలకు ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉంది. మరోవైపు వైసీపీ శిబిరం ఇంకా నిరాశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
క్యాడర్‌లో కూడా జోష్ నింపేందుకు పక్కా ప్లాన్..!
అయితే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ఈక్వేషన్..ఎన్విరాన్‌మెంట్‌ను గమనిస్తున్న వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ క్యాడర్‌లో కూడా జోష్ నింపేందుకు పకడ్బందీ ప్లాన్స్ సిద్ధం చేస్తోందట. అప్పుడెప్పుడో 2022లో వైసీపీ అధికారంలో ఉన్నపుడు గుంటూరు వేదికగా ప్లీనరీని నిర్వహించింది. ఆ తర్వాత నాలుగేళ్లుగా పార్టీ పండుగ అంటూ ఏదీ లేదని అంటున్నారు. అయితే ఇప్పటివరకు పొలిటికల్ పిచ్‌గా దూరంగా ఉంటూ వస్తున్న వైసీపీ..ఇప్పుడు క్యాడర్‌లో ఉత్సహం పెంచి గ్రౌండ్‌లోకి దిగేందుకు పెద్ద ప్లానే చేస్తోందట.
టీడీపీ మహానాడు తరహాలో వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు..!
టీడీపీ మహానాడు తరహాలో వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశాలను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ స్టార్ట్ అయిందట. సాధ్యమైంత తొందరగానే భారీ బహిరంగ సభతో బిగ్ సౌండ్ చేసి పబ్లిక్ దృష్టిని ఆకట్టుకోవడంతో పాటు..క్యాడర్‌లో జోష్ పెంచేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. పార్టీ బూత్ లెవెల్ కమిటీల నియామకం పూర్తి కాగానే..రాష్ట్ర స్థాయి సమావేశాలకు నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికలే టార్గెట్‌గా అటు టీడీపీ, ఇటు వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి. అయితే విపక్షం కంటే అధికార పార్టీ ఒక అడుగు ముందే ఉంది. కాస్త లేటుగా మేలుకున్న వైసీపీ..లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు..భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడ నుంచి జిల్లాల పర్యటనపై జగన్ ప్రకటన చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత పాదయాత్ర ప్లానింగ్స్ ఉన్నాయని.. చెప్పుకొస్తున్నారు. టీడీపీకి ధీటుగా వైసీపీ వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read: ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
