Annamayya District Gun Firing : అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు కలకలం రేపాయి. పీలేరు మండలం ముల్లగూరిపల్లిలో వైసీపీ నేత మల్లికార్జునపై కాల్పులు జరిపాడో దుండగుడు. ఈ కాల్పుల్లో మల్లికార్జున కాలికి గాయమైంది. చికిత్స కోసం మల్లికార్జునను ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు? ఎందుకు కాల్పులు జరిపాడు? నాటు తుపాకీ ఎక్కడిది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.