ప్రేమ పేరుతో యువకుడు వేధింపులు..పురుగులమందు తాగి టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య
- bheemraj
- Published On : December 20, 2020 / 11:44 AM IST
ssc student commits suicide : గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువకుడు వేధించడంతో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్ధిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మేడికొండూరు మండలం కొర్రపాడులో ఈ విషాదం జరిగింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. తన సూసైడ్‌కు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో బాధితురాలు వేడుకుంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీదేవి ప్రకటించారు. బాధితురాలి మృతదేహాన్ని సందర్శించారు.
భానుప్రసాద్ అనే యువకుడు వేధిస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొంది. యుకుకుడు సత్తెనపల్లిలో చదువుతున్నాడు. వచ్చి పోయి క్రమంలో అమ్మాయిని వేధిస్తున్నాడు. వేధింపుల విషయాన్ని కుటుంబ సభ్యులు, బయటివారికి చెప్పలేక మదనపడింది. దీంతో యువతి ఈనెల 13న
పరుగుల మందు తాగింది.
ఆమెను చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిన్న సాయంత్రం చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భానుప్రసాద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది.
