AP Rain Alert : ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ

AP Rain Alert :ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని, ఈ కారణంగా వచ్చే వారంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

AP Weather Updates

AP Rain Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అయితే పిడుగులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Also Read : Ambati Rambabu: వైకాపా నేత అంబటి రాంబాబుకి షాక్.. కిర్లంపూడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు

ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని, ఈ కారణంగా వచ్చే వారంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో అక్టోబర్ 12వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తరువాత 24గంటల్లో అంటే అక్టోబర్ 13వ తేదీన అది అల్పపీడనంగా మారుతుందని, క్రమంగా బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబర్ నెల కావడంతో తుపాన్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ప్రస్తుతం పరిస్థితులు కొనసాగితే ఏపీలో వచ్చే వారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

మరోవైపు.. ద్రొణి ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (మంగళవారం) రాష్ట్రంలో కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న ఏపీఎస్డీఎంఏ .. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు స్పష్టం చేశారు.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షాల, ఈదురుగాలుల సమయంలో రైతులు, కూలీలు పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.