Kadapa Accident: కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. ముగ్గురు దుర్మరణం
కడప(Kadapa Accident) జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
- V Santhosh Kumar
- Published on- June 27, 2026 / 07:31 AM IST
Horrific road accident occurred in YSR Kadapa district; three people reportedly passed away
Kadapa Accident: కడప జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం పాలెంపల్లె వద్ద రెండు కార్లు ఎదురెదురుగా అత్యంత వేగంతో ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత(Kadapa Accident)కు రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Driving License: ఇకపై ‘డ్రైవింగ్ లైసెన్స్’ పొందటం అంత ఈజీ కాదు.. ఈ 3 టెస్టులు పాస్ అవ్వాల్సిందే
కార్లలో చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, అత్యవసర చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో కార్లలో ప్రయాణిస్తున్న వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, మృతుల వివరాలు ఏమిటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతివేగమే ప్రమాదానికి కారణమా లేక మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
