Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన.. భార్య ఉరివేసుకుంటుండగా నవ్వుతూ వీడియో తీసిన భర్త.. అసలు విషయం తెలిసి కాపాడే ప్రయత్నం చేయగా..

Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా.. భార్య ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. భార్య ఉరివేసుకునే ప్రయత్నాన్ని ఆపాల్సిన భర్త.. ఏం చక్కా నవ్వుతూ వీడియో తీశాడు.

Husband Laughs And Records Video While Wife Attempts Suicide In Rajampet In Kadapa District

  • ఏపీలోని కడప జిల్లాలో దారుణ ఘటన
  • భార్య ఉరివేసుకుంటుండగా వీడియో తీసిన భర్త
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా.. భార్య ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. భార్య ఉరివేసుకునే ప్రయత్నాన్ని ఆపాల్సిన భర్త.. ఏం చక్కా నవ్వుతూ వీడియో తీశాడు. తనను బెదిరించడానికి ఇలా చేస్తుందని భావించి ఈ విషయాన్ని సరదాగా తీసుకున్నాడు. కానీ, ఒక్కసారిగా ఉచ్చు మెడకు బిగుసుకోవడంతో అవాక్కైన భర్త కాపాడే ప్రయత్నం చేశాడు. ఎంతకీ గడియ రాకపోవడంతో కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చి గడియతీసి కాపాడే ప్రయత్నం చేశారు.. అప్పటికే ఆమె మృతిచెందింది. ఈ ఘటన రాజంపేటలో చోటు చేసుకుంది. ఈ వీడియో శుక్రవారం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Also Read : Payyavula Keshav: ఈడీ.. రెడీ.. ఎందుకు, ఏ కేసులో? ఏపీలో పొలిటికల్ హాట్‌ టాపిక్‌గా పయ్యావుల కామెంట్స్

వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలం బోయనపల్లెలో శ్రీరామ శ్రీనివాసులు, భార్య కృష్ణవేణి (30) నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులు రైల్వేలో లోకోపైలట్‌గా పనిచేస్తున్నాడు. 2016లో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీనివాసులకు మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతుండేవి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న భార్య.. తాను చనిపోతానంటూ పలుసార్లు పేర్కొంది. అయితే, గురువారంసైతం భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తాను చనిపోతానంటూ కృష్ణవేణి ఉరివేసుకునే ప్రయత్నం చేసింది.

ఇంట్లో తలుపులకు గడియ పెట్టుకుని చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకునే ప్రయత్నం చేసింది. ఫ్యాన్‌కు చీరను బిగించి మంచం పైకి‌ఎక్కి ఉరిని మెడకు తగిలించుకుంది. తనను బెదిరించడం కోసం భార్య ఇలా చేస్తుందని భావించిన శ్రీనివాసులు.. కృష్ణా సరిగా ఉరేసుకో అంటూ.. నవ్వుతూ వీడియో తీశాడు. కొద్దిసేపటి తరువాత కృష్ణవేణి మంచంపై నుంచి దిగుతుండగా మెడకు ఉచ్చు బిగుసుకుంది. దీంతో అవాక్కైన భర్త డోర్ తీసి కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, గడియ రాకపోవటంతో గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చి బలవంతంగా తలుపును తీసి కృష్ణవేణిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆమె మృతిచెందింది.

శుక్రవారం వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదుచేసి శ్రీనివాసులును విచారిస్తున్నారు. మరోవైపు శ్రీనివాస్‌కు ఇది రెండో వివాహం అని, మొదటి భార్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని కృష్ణవేణి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి కృష్ణవేణిని రెండో పెళ్లి చేసుకున్నాడని.. తరచూ వేధించేవాడని చెబుతున్నారు. శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.